Press "Enter" to skip to content

గోమాత విశిష్టత 7 – వ్యవసాయంలో గోవు, గోసంతతి ప్రయోజనం, ప్రాముఖ్యత

గోమాత విశిష్టత

Indian Cows in Agriculture

చాలా ముఖ్య విషయ మేమంటే ప్రఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త డా. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1948 లో మన దేశానికి వచ్చే డా. అమర్ నాధ్ ఝా అనే విద్యవేత్త ద్వారా ఒక సందేశం పంపారు. అది ‘భారతదేశంలో ట్రాక్టర్లవంటి యంత్రాలద్వారా నడిచే వ్యవసాయాన్ని అమలుచేయవద్దు. 400 సంవత్సరాలపాటు యంత్రాలద్వారా వ్యవసాయం చేయడంవల్ల అమెరికాదేశపు వ్యవసాయభూమి నిస్సారమైపోయింది. 10వేల సంత్సరాలపైగా వ్యవసాయం సాగుచున్న భారతదేశపు మట్టిలో సారం, శక్తీ ఇప్పటికీ తరిగిపోలేదు’ అన్నారు. యంత్రములద్వారాకాక గోసంతతిద్వారా వ్యవసాయం చేయటంలోని ప్రయోజనం ఆ శాస్త్రవేత్త సందేశంద్వారా అయినా గ్రహింపక గోసంతతిని నాశనం చేసికొని వినాశందిశగా పరుగులెత్తుతున్నాం. రసాయనిక వనరులతో సాగుతున్న వ్యవసాయం భోజనవిధానాన్ని కుంచింపజేసింది. తత్ఫలితమే ఈనాటి ప్రమాదకరమైన రోగాలు, వాతావరణ కాలుష్యాలు. అందుకే సర్ హోవర్ట్ ‘యంత్రాలద్వారా సాగే వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, క్రిమినాశకమందులు తప్పనిసరి అవుతాయి. యంత్రాలద్వారా జరిగే వ్యవసాయపు టెక్నాలజీ భయంకరమైన వాతావరణకాలుష్యాన్ని వ్యాప్తంజేస్తుంది. అనర్థాలకు ఆలవాలమైన యాంత్రిక వ్యవసాయాన్ని వైజ్ఞానికం అనటం తప్పు’ అన్నారు. పంట దిగుబడి యాంత్రిక, రసాయనిక వ్యవసాయం వలననే పెరిగిన దనుకొనటం భ్రాంతి. పరిశోధనాత్మక కృషితో దేశీయ విధానంలోను వ్యవసాయంచేసి ప్రమాదకరమైన రోగాలకు నిలయంకాని మంచి దిగుబడిని సాధింపవచ్చు.

[wp_campaign_1]

‘Institute of Economics Guidance in India’ అనే ప్రభుత్వసంస్థ లెక్కల ప్రకారం మన ఎడ్లనిటినీ వ్యవసాయంనుండి తీసేస్తే 2 కోట్ల ట్రాక్టర్లు అవసరమౌతాయట. అందుకు 4,50,000 కోట్ల పెట్టుబడి అవసరమౌతుంది. ఈ ట్రాక్టర్లను నడపటానికి ఏటా 1,75,000 కోట్ల రూపాయల డీజిల్ అవసరం. గోసంపద నాశనమవటంతో యాంత్రిక వ్యవసాయం, దానివల్ల చీడపీడలు పెరిగి రసాయనిక ఎరువులు వాడటంతో రైతుమిత్రులు వానపాములవంటి అవసరజీవులు నశించి భూసారం దెబ్బతిని పైర్లకు రోగాలురాగా క్రిమిసంహారక మందులవాడికతో భూమి విషతుల్యమై సమస్యల వలయాలలో చిక్కి రైతు ఆత్మహత్యకు దిగటం చూస్తున్నాం. గోమాతను, భూమాతను నమ్ముకుంటే ఈగతి పట్టదు. స్వాతంత్ర్యం వచ్చిననాటికి మనదేశంలో 36 కోట్ల పశువులుండగా మరి ఏబదియేండ్లకు అవి 10 కోట్లకు తగ్గిపోయాయి. మాంసం ఎగుమతి 9500 టన్నులకు పెరిగి 30 యాంత్రిక పశువధశాలలకు అనుమతి వచ్చింది. కాడి జోడెడ్లు, ఆవుదూడలను అసలు వాడికలో లేకుండా చేస్తూ ఎలక్షన్లలో వాడుకోవడం మాత్రం జరిగింది. ఇతరదేశాలు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులవై నడుస్తోంటే మనం దుబాయ్ షేకులకు మాంసం అమ్ముకొంటూ ప్రమాదంలోకి పోతున్నాయి.

మరో ముఖ్యవిషయ మేమంటే భూకంపాలకు కారణంగూర్చి 1995లో మాస్కో సమీపంలో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో పరిశోధనా పత్రాలలో వివరింపబడింది. ఐన్
స్టీన్ చెప్పిన వేదనాతరంగాలవలె వీరు వెలుగులోకి తెచ్చిన ‘బిస్ ప్రభావము’ భూకంపాలకు కారణమని, ఆ ‘బిస్ ప్రభావానికి’ పశువధశాలలు కారణమని పరిశోధకులు వివరించారు. ఆవుపేడ పిడకలు కాల్చటంవలన వచ్చే పొగ, ఆవుపేడతో అలికిన గోడలు అణుశక్తివల్ల వచ్చే రేడియేషన్ నుండి కాపాడగలవని విదేశీ శాస్త్రజ్ఞులు ఋజువు చేస్తున్నారు. ఆవునెయ్యితో చేసే హోమంవలన వచ్చేపొగ వాతావరణంలోని అనారోగ్య క్రిములను, ఎలర్జీని పోగొడుతుందని, గోవు ఉండటమే గొప్ప పర్యావరణ పరిరక్షణ అని చెప్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులు విశృంఖలంగావాడి ఆ ఆహారపదార్థాలను తినడంవల్ల కేన్సర్ వ్యాధి సోకేప్రమాదముందని, కిడ్నీ చెడిపోయే ప్రమాదముందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎరువు, పురుగుమందులు అధికంగా ఉపయోగించడం వలన మనదేశంలో ఏటా 30,000 మంది రైతులు మృత్యువువాత పడుతున్నారని, గోమూత్రం, పేడతో, ఎరువులు వాడితో పై ప్రమాదాలేవీ ఉండవని మేనకాగాంధీ చెప్పారు. వాటివల్ల కాలుష్యం ఏ స్థాయికి వచ్చిందంటే పసిపిల్లలకు తల్లులిచ్చే చనుబాలుకూడా కలుషితమయే తీవ్రస్థాయి ఏర్పడుతోంది. కోటానుకోట్ల ధనం ఎరువులకు, పాలపొడికి వెచ్చిస్తూ గోమాంసం, తోళ్ళు అమ్ముకొని అనేక నష్టాలపాలవడం కాక, భూమిని, మన శరీరాన్ని రోగమయం చేసికొని వినాశాన్ని కొనితెచ్చు కొంటున్నామన్నమాట. ఒక పశువుమూత్రం వినియోగించి సాలీనా 36,000 రూపాయల విలువైన ఎరువులు తయారుచేసుకోవచ్చని పరిశోధకులు తేల్చారు. గోవుకోసం మనం అంత ఖర్చుపెట్టంకదా! బి.హెచ్.సి., DDT, ఎండ్రిన్, ప్యారామాల్ మోనోక్రోటోఫాస్ వంటి మందులు ఆయాదేశాలలో వాడటం నిషేధించడంతో వానిని మనం కొనితెచ్చుకొని ప్రమాదం కొనితెచ్చుకొంటున్నాము. ఆ దేశాలు వాటిని ఎందుకు నిషేధించాయో, అయినా ఉత్పత్తి చేసి మననెత్తిన ఎందుకు రుద్దుతున్నారో మనం గుర్తించడంలేదు. వాటివల్ల జీన్స్ లోపంకలిగి భవిష్యత్తరాలు దెబ్బతినడానికికూడా మనం విషబీజం నాటుతున్నాం.

[wp_campaign_2]

ఆవుపేడ, మూత్రములద్వారా తయారుచేయదగిన ఎరువులనుగూర్చిన పద్ధతులు ఎన్నోవిధాల ఉన్నాయి. వరినాట్లు అయాక 20రోజులకు ఒక లీటరు ఆవు మూత్రానికి 10 లీటర్ల నీరు కలిపి స్ప్రే చేస్తే అద్భుతఫలితం ఉంటుంది. అనంతరం 20రోజులకు చూడి ఆవు మూత్రం 1:10 నిష్పత్తిలో స్ప్రేచేసి మళ్ళీ 20రోజులకు చూడిఆవు మూత్రాన్ని లీటరుకు 50 గ్రాముల వాయువిడంగాలు కలిపి 24 గంటలు నానబెట్టి స్ప్రే చేయాలి. 15 రోజులు మురగబెట్టి పైరు పూసే సమయానికి ముందు ఆకులపై స్ప్రే చేస్తే దిగుబడి మామూలుకన్నా రెండింత లవుతుంది. ఈవిధంగా అంకోలామొక్క ఆకులు, కాయలతోకూడా చేయవచ్చు. ఇలా వంట దిగుబడి సాధిస్తూనే భూసారాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకొని వాతావరణకాలుష్యంలేక జీవించవచ్చు. ఖర్చులేని మేలైన పధ్దతి ఇది. దీనివల్ల రైతు అప్పుల్లో కూరుకుపోవడం, పురుగుమందుకు బలికావడం ఉండదు. అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘం (ఇస్కాన్) వారు బెంగళూరు మున్నగుచోట్ల కేవలం ఆవుకు సంబంధించిన ఎరువులద్వారానే అన్నిరకాల పంటలు విశేషంగా పండించి వారి దేవాలయాలో వాటిని ప్రచారంగా అమ్ముతున్నారు. (ఇంకా ఉంది…)

[wp_campaign_3]

One Comment

  1. Sunita Sunita July 15, 2011

    ఈ వ్యాసాన్ని ఈనాడు పత్రిక వారు ప్రచురిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: