Press "Enter" to skip to content

Sri Parasara Samhita Part 3 – శ్రీ పరాశర సంహిత తృతీయ భాగము

parasara samhita 3

ధన్యోహం కృతకృత్యోహమ్

ఏనాటి పరాశర మహర్షి! ఏనాటి పరాశర సంహిత! ఈనాటిదాకా నా దాకా వెలుగు చూడకుండా ఉండటమేమిటి? సుదీర్ఘకాలంగా మహాపండితుల కృషితో వెలువడక అల్పజ్ఞుడయిన నా దాకా ఆగటమేమిటి? కేవలం ఆ హనుమత్స్వామియొక్క కరుణ తప్ప మరేకారణముంటుంది? ఏ జన్మలో చేసికొన్న తపమో ఇలా ఫలించిందని నా భావన. పూజ్య గురుదేవులు శ్రీ పాలపర్తి వేంకట సుబ్బావధానులు గారి రూపంలో స్వామి పూర్వ తపస్సును కొనసాగింపచేసి వారి ఆదేశంతో పరాశరసంహిత కృషికి ప్రేరేపించాడని భావన.

తన సేవను ఒకరకంగా కాదు. అనేక విధాల చేయించుకొని హనుమత్స్వామి నా జన్మ ధన్యమయ్యేటట్లు చేశాడు. వేలఏండ్లుగా తాళపత్రాలలో వ్రాతప్రతులలో మ్రగ్గుచున్న ఉద్గ్రంధం నాకోసం ఆగి ఉంది. ఒకరిద్ధరు కొంత వెలువరింప యత్నించారు తప్ప కృతకృత్యులు కాలేకపోయారు. అలా నాద్వారానే శ్రీపరాశర సంహిత పూర్తి గ్రంధాన్ని వెలుగులోకి తెచ్చుకొన్నాడు.

ఎందరి సహకారమో లభించుటవలన తప్ప కేవలం ఒక్కడుగా దేనినీ సాధింపలేను. ఎందరి పేర్లని సహాయకులుగా వ్రాయగలను? కాన వ్యక్తి వ్యక్తికీ ఎల్లవేళలా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. ఇంతటి ధన్యత ననుగ్రహించిన హనుమత్స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకొంటున్నాను. గ్రంధముద్రణ సహాయకుల ననుగ్రహింప స్వామిని వేడుకొంటున్నాను.

మూల్యముః రూ.200.00

2 Comments

  1. Pavan Kumar Pavan Kumar March 31, 2020

    Great work

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: