ఓం శ్రీరామ
జయహనుమాన్

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||

హనుమత్ స్వరూపులయిన మా గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ….

ఈ యత్నం ఎందుకంటే…….

శ్రీహనుమంతుని భక్తుడనయిన నేను హనుమంతుని విజ్ఞాన సర్వస్వమయిన పరాశర సంహితకోసం ఎంతో యత్నించాను. వేలసంవత్సరాలుగా తాళపత్రాలు, వ్రాతప్రతులలో మగ్గుతున్న ఆ గ్రంథాన్ని విశేశ కృషిచేసి వెలుగులోకి తెచ్చినవారు డా. అన్నదానం చిదంబరశాస్త్రిగారు. వారి వివరాలు తెలిసికొనటానికి ఎంతో ప్రయాసపడవలసి వచ్చింది. హనుమంతునిపై పరిశోధన చేసి, వారు డాక్టరేట్ పొందారు. హిందూధర్మ సర్వస్వం వ్రాశారు. ప్రసారమాధ్యమాల ద్వారా హనుమచ్చరిత్ర, సదాచారంవంటి వందించుచూ, సనాతన ధర్మంపై పత్రికను నడుపుచున్నవారు, ఆధ్యాత్మిక సమాలోచనపరులకు అత్యంతం అవసరమయిన వ్యక్తి. కాబట్టి వారి పరిచయం, వారి గ్రంథాల పరిచయం, లోకానికందించటం ఎంతో అత్యవసరమని భావించాను.

నావలె ఇతరులెవ్వరూ శ్రీశాస్త్రిగారిని గూర్చి తెలిసికొనటానికి ప్రయాసపడకూడదని తలచాను. అనేక కోణాలలో అధ్యాత్మిక రంగంలో ప్రముఖస్థానంలో నిలచిన శ్రీచిదంబరశాస్త్రిగారి కృషిని ఈ వెబ్ సైట్ ద్వారా తెలియజేయడం మంచి ఆధ్యాత్మిక సేవ కాగలదని అందుకు పూనుకున్నాను. ఈ కృషిలో నాకు సహకరించు శ్రీ పురాణం అనిల్ కుమార్ – నాగశ్రీ దంపతులకు కృతజ్ఞతలు.

పూర్తి విషయాలను ఈ సైట్ లొ పరిశీలించి, హనుమద్విషయాలు, ధార్మికవిషయాలు సమగ్రంగా గ్రహింపగలరని ఆశిస్తున్నాను…

ఇట్లు
భవదీయ
అడివి రమేష్ చంద్ర
(Adivi Ramesh Chandra)
M: +91.(984)924-5355
E: admin@jayahanumanji.com