శ్రీ పరాశర సంహిత గ్రంథం ముద్రణ

శ్రీ పరాశర సంహిత హనుమద్భక్తుల పాలిట కల్పవృక్షమను విషయం అందరకూ తెలిసినదే. వేల సంవత్సరాలుగా మరుగున పడియున్న ఆ గ్రంథం మన తరంలో వెలుగుచూడటం మన అదృష్టం. మూడవ భాగం వెలువడవలసి యుండగానే, ముద్రించి చాలాకాల మగుటవలన మొదటి రెండు భాగములను కుడా తిరిగి ముద్రించవలసిన పరిస్థితి ఏర్పడినది.

మెదటి రెండు భాగముల వలన వచ్చిన ద్రవ్యం హనుమత్పీఠమునకు చెందజేయడమైనది. కావున మొత్తం మూడు భాగములు ముద్రింపవలసిన పరిస్థితి ఏర్పడినది. ఒక్కో భాగము ముద్రణకు సుమారు ఏబది వేలరూపాయలు కాగలదు. కొంత భక్తుల సహకారము స్వీకరించిన తప్ప ముద్రించుట అసాధ్యము. కావున ఈ మహత్కార్యమున మిమ్ముకూడ భాగస్వామి కొగోరుచున్నాను. వేయిరూపాయలపైన సమర్పించిన వారి పేర్లు గ్రంథమున ముద్రింపబడును. ఐదు వేలపైన సమర్పించినవారి ఫొటో కూడ ముద్రింపబడును. మీకు సాధ్యమగు సహకారము నందించి శ్రీ పరాశర సంహితా ప్రచారమున భాగస్వాములై హనుమదనుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్థన.

ఇట్లు,
హనుమత్సేవకుడు,
అన్నదానం. చిదంబర శాస్త్రి.
+919848666973