గోమాత

Gomatha

గోవు వలన ప్రయోజనాలుః ఆవు మనకు అనేక విధాల ప్రయోజనకారి.
ఆవుపాలుః పసిపిల్లలకు తల్లిపాలు అమృతసమాలు. తల్లిపాల తరువాత వారికి శ్రేష్టమైనవి ఆవుపాలే. తల్లిపాలు కొరవడిన పిల్లలకు ఆవుపాలు పట్టటమే సర్వవిధాల శ్రేయస్కరం. పసితనం దాటినా అట్టి తల్లిపాల అమృతఫలాన్ని అన్ని విధాలా పొందగల్గుటకు మార్గం గోమాతపాలు త్రాగటమే. కాబట్టే ‘గావః విశ్వస్య మాతరః’ గోవులు ప్రపంచజను లందరకూ తల్లులు అని వేదం చెప్పింది. ‘దేని లాభాలు లెక్కించలేమో అది గోవు’ అని యజుర్వేదం చెప్పింది. తల్లిపాలలోని గుణాలు, ఇంకా విశిష్టగుణాలుకూడా ఆవుపాలలో ఉన్నాయి. అందుకే పిల్ల, పెద్దలందరకూ అవి స్వీకరింపదగినవి. ఆవుపాలు సమశీతోష్ణంగా ఉంటాయి. మధురంగా ఉంటాయి. వీర్యపుష్టి, బలము, జఠరదీప్తి, దీర్హాయువు, బుద్దిబలం చేకూరుస్తాయి. జీర్ణజ్వరం తొలగిస్తాయి. స్త్రీల పిండోత్పత్తిస్థానానికి బలం చేకూరుస్తాయి. బాలింతలకు పాలుబడచేస్తాయి. అనేకవ్యాధులను ఆవుపాలు నయంచేస్తాయి. ఆవుయొక్క రంగును బట్టి ఈతలను బట్టి మేతలను బట్టి ఆవుపాలు ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాయని వైద్యశాస్త్రం చెప్తోంది. నల్లఆవుపాలు పైత్యహరం. ఎరుపు ఆవుపాలు కఫహరం. చారలఆవులు వాతపైత్య హరం, త్రిదోష హరం, కపిలవర్ణపు ఆవుపాలు వీర్యపుష్టిని, కండ్లకు చలువను కలిగిస్తాయి. తెలకపిండిమేసిన ఆవుపాలు గురుత్వం, కఫం కలిగిస్తాయి. ప్రత్తిగింజలుమేసిన ఆవుపాలు అపథ్యం. పచ్చగడ్డిమేసిన ఆవుపాలు, ఎండు గడ్డిమేసిన ఆవుపాలు త్రిదోషహరం. తొలిఈత ఆవుపాలు బలము కలిగించి పైత్యం పోగొడతాయి. రెండవ ఈతవి వాతహరం, మూడవఈతవి శ్లేష్మవాతహరంకాగా, నాల్గవ ఈత ఆ పై ఈతల ఆవుపాలు త్రిదోషహరం. సాధారణంగా ఆవుపాలలో వైరస్ ను తొలగించే శక్తి ఉంది. ఆవుపాలు విరేచనం సాఫీగా అవటంలోనూ, కంటిచూపును అభివృధ్ది చేయడంలోనూ తోడ్పడతాయి. ఇవి వాజీకరం. ఆవుపాలను ఎప్పుడూ వాడుతూఉంటే వార్ధక్య బాధ సమీపించదు. ధారోష్ణధుగ్ధం అంటే పొదుగు నుండి వస్తూనే వేడిగా నుండే పాలు అమృతతుల్యం. ఏమాత్రం ఆలస్యమైనా పచ్చిపాలదోషం దానికి పడుతుంది. ఆవుపాలలో ఆధ్యాత్మికశక్తినికూడా పెంపొందించే గుణముంది. అందు సరస్వతి ఉంది.

పంచామృతాలు, పంచగవ్యాలు కూడా బుద్ధిశక్తిని గొప్పగా పెంచుతాయి. పిల్లలకు గేదెపాలు మాంద్యాన్ని కలిగిస్తే ఆవుపాలు చురుకుదనాన్ని తెలివినీ పెంచుతాయి. ఇవి పురాణజ్వరం, మానసిక వ్యాధులు, క్షయ, మూర్చ, భ్రమ, సంగ్రహణి, పాండువు, హృద్రోగం, ఉదరశూల, శిరస్సూల, మొలలు, హెమరేజ్, అతిసారం, స్త్రీవ్యాధులు, గర్భస్రావాదులకు ఎంతో హితకరం. పంచకర్మచికిత్సలోకూడా ఆవుపాలు ఎంతో ఉపయోగం. ఆవుకు సంబంధించి పంచగవ్యపు ఐదు పదార్థాలతో చేయదగు చికిత్సలే ఒక ప్రత్యేక గ్రంధమౌతుంది. ఆవుపాలవలన గర్భపుష్టి, దార్ఢ్యం కల్గుతాయని, గొడ్రాళ్ళకు, వృద్ధులకు సైతం సంతానం కలుగుతుందని కాస్యపసంహితలో చెప్పబడింది. అమెరికాలోని వ్యవసాయశాఖ ‘The Cow Is A Most Wonderful Laboratory’ అనే గ్రంధంలో ఆవుపాల గుణాల నెంతగానో తెల్పింది. గడ్డి, గాదంలోని విషపదార్థాలన్నీ జీర్ణంచేసికొని సత్పదార్థాలనే మనకీయగలది గోవు. 180 అడుగుల పొడవుగల ప్రేవు నాల్గుకాళ్ళజంతువులలో ఒక్క గోవుకు మాత్రమే ఉంది. రష్యాశాస్త్రవేత్తలు కూడా గోద్రవ్యాల ఉపయోగాలు గుర్తించి చాటి చెప్పారు. ఎంతో కష్టపడి సముద్రమధనంవల్ల ఏనాడో దేవతలు అమృతం పొందగల్గుతారు. కొద్ది యత్నంలోనే సాధింపగల్గిన నేటి అమృతం గోక్షీరం. ఈ అమృతము దీర్ఘాయువును, తేజస్సును, మేధను, వీర్యాన్ని ప్రసాదిస్తుంది. పుంస్త్వం తక్కువగా ఉన్నవారికి పుంస్త్వం పెంచగల రసాయనం ఆవుపాలు. జ్ఞాపకశక్తి, రక్తవృధ్ది, రోగనిరోధకశక్తి వంటివేగాక సంస్కారమూ ఈయగలవి ఆవుపాలు. అందుకే ఋషిమునిగణం జీవనాధారంగా ఆవుపాలే స్వీకరిస్తారు. జీవితాంతం ఆవుపాలు వాడేవారు నిండు నూరేళ్ళు బ్రతుకుతారు. సైంటిస్టుల నిర్ణయంప్రకారం ఆవుపాలు మంచి పుష్టికరమైన భోజనంతో సమానం. అందులో 87% నీళ్ళు, 3.7% ఘృతం, 0.75% క్షారం, 3.6% ప్రోటీన్సు, 4.6% చక్కెర, ఇంకా విటమినులు వంటి ప్రయోజనకరము లన్నీ ఉన్నాయి. గోవు వెన్నుయొక్క కేంద్రంలో ఉన్న ఒక అద్భుతశక్తి సూర్యనాడివల్ల దానిలో, దానిపాలలో అతిసాధారణ శక్తి ఉంటుంది. ఆవును తాము పెంచుటకు అవకాశంలేనివారు పెట్టుబడిపెట్టి సన్నిహితులగు పాలు పోసేవారిచే వ్యవసాయ దారులచే పెంచజేసి పాలువాడుట మంచిది. పిల్లల శారీరక, మానసిక, సర్వాంగీణవృధ్ది కాంక్షించేవారు వారికి ఆవుపాలనే ఇచ్చి మహోన్నతులనుచేయవచ్చు.

[wp_campaign_1]

ఆవు పెరుగుః ఆవు పెరుగు మేహశాంతి, పైత్యశాంతి చేకూరుస్తుంది. జఠరదీప్తి కల్గిస్తుంది. కొద్దిగా వేడిచేస్తుంది. దేహపుష్టి, కాంతిని ఇస్తుంది. వ్యయప్రయాసలకు వెనుకాడి మనం గేదెపెరుగు, మజ్జిగ వాడుతున్నాము. అది ఆవుపెరుగంతటి శ్రేయస్కరం కాదు. శ్రీహర్షుని వృత్తాంతమే ఇందుకు నిదర్శనం.

ఆవుచల్లః ఇది చలువ, మేహ శాంతి, పైత్యశాంతి చేస్తుంది. అగ్నిదీప్తినిచ్చి జీర్ణశక్తిని పెంచుతుంది. ఆమాతిసారము, ఉబ్బు, గ్రహణి, పాండువు, మేహము, గుల్మము, ఉదరవ్యాధి, మూలవ్యాధి, పసికర్లు, పైత్యం, పురాణజ్వరం, అరుచి, శోష, కాస, క్షయ, శీతపైత్యరోగాలకు పథ్యము.

ఆవువెన్నః ఇది కొద్ది పసుపురంగుగా ఉంటుంది. నిమ్మకాయంత ఆవువెన్న సుమారు తవ్వెడు మరుగునీళ్ళలో వేసి క్రమంగా త్రాగిస్తే మలమూత్ర బధ్దకం పోతుంది. ఇది త్రిదోషహరం. ఆయుర్వృధ్ధి, వీర్యవృధ్ధి, చలువ, నేత్రరోగాలు పోగొట్టటం వంటివి చేస్తుంది.

ఆవునెయ్యిః ఇదికూడా త్రిదోషహరం. సర్వదోషాలను హరిస్తుంది. ధాతుపుష్టి, రక్తపుష్టి, వీర్యవృధ్ది, ఆయుర్వృధ్ధి కల్గిస్తుంది. జ్ఞాపకశక్తిని, నాడీశక్తిని పెంపొందిస్తుంది. అనేక వ్యాదులకది పథ్యం. కొలెస్ట్రాల్ సమస్య లేనిది. కాబట్టి రక్తపుపోటు, హృద్రోగబాధ కలవారు కూడా దీనిని వాడవచ్చు. నేతితో తలంటుకొని శిరస్నానం చేయటం శిరస్సు, నేత్రములకు మేహశాంతి. దేవాలయాలలో దీపారాధనకు, విశేషించి కార్తీకమాసాది దీపదానములకు దీనినే వాడాలి. దేవతా కార్యాలన్నింటా గోఘృతమే వాడదగినది. ఆవునేతితో యజ్ఞం చేస్తే రేడియోధార్మిక, అణుధార్మిక కిరణాల దుష్టప్రభావాలు ఏమైనా ఉంటే తొలగుతాయి. (ఇంకా ఉంది…)

[wp_campaign_2]