Press "Enter" to skip to content

Posts tagged as “Hanuman”

శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు – 17th May, 2020 – ఆదివారము

  ఆత్మీయ బంధువులారా! ఈ సంవత్సరము 17th May, 2020 ఆదివారము నాడు శ్రీ హనుమజ్జయంతి సందర్భముగా, హనుమత్ భక్తులందరికీ శుభాకాంక్షలు.  వైశాఖేమాసి కృష్ణాయాం- దశమీ మందసంయుతా పూర్వప్రోష్టపదా యుక్తా – తథా వైధృతిసంయుతా …

15th May, 2012 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీహనుమజ్జయంతి

శ్రీరామ
జయ హనుమాన్

(May 15, 2012 న శ్రీ హనుమజ్జయంతి సందర్భమున)

Jaya Hanumanశ్రీ హనుమజ్జననం
లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సువలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు కేసరినందనుడు, ఆంజనేయుడు, అగ్నిపుత్రుడు, పవనసుతుడు, శంకర తనయుడు అని కీర్తింపబడుచున్నాడు.

హనుమజ్జయంతి
హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమందు, వైధ్రుతి యోగమున, మధ్యాహ్న సమయమందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతినక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.

హనుమంతుని రెండవ అవతారమైన వీరాంజనేయ చరిత్ర

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

Sri Veeranjaneya Swamy - శ్రీ వీరాంజనేయస్వామి అవతారము
Sri Veeranjaneya Swamy - శ్రీ వీరాంజనేయస్వామి అవతారము

శిష్యుడుః శ్రీ హనుమంతుని రెండవ అవతారం వీరాంజనేయ చరిత్ర గురించి చెప్పుకొనాలండీ.

గురువుగారుః అవును. శ్రీ హనుమంతుని రెండవ అవతారం వీరాంజనేయస్వామి అవతారం. సుందరీనగరమనే హనుమత్పీఠంయొక్క దివ్యచరిత్ర ఇది. అంతేకాక అష్టాదశాక్షరీ మహా మంత్ర ప్రభావ చరిత్రకూడా. ఈమంత్రానికి అగస్త్యుడు ఋషి. గాయత్రీ ఛందస్సు. హనుమాన్ దేవత.ఈ మంత్ర అధిదేవత అయిన వీరాంజనేయ అవతారమూర్తి ధ్యానం –

గోమాత విశిష్టత 9 – గోహత్యా నిషేధోద్యమం

గోమాత విశిష్టత – గోహత్యా నిషేధోద్యమం

Indian Cow

ఎంతో విశిష్టత, ఎన్నో ప్రయోజనాలు కల్గినగోవు నేడు మన అజ్ఞానకారణంగా ఎంతో ప్రమాదంలో పడింది. ‘మృత్యుగృహ ద్వారంవద్ద గోవు నిలబడి ఉంది. దాన్ని రక్షించగలమో లేదో కానీ గోవుతోబాటు మనము, మన సభ్యత నష్టపోవటం మటుకు ఖాయం అన్నారు గాంధీజీ. నిజంగానే మనం గోవును రక్షించలేకపోతూ అన్నివిధాలా నష్టపోతున్నాం. ఈస్టిండియాకంపెనీ వారు హిందూరాజులతోది సంధిపత్రాలలో ‘గోవధ చేయము’ అనే షరతు స్పష్టంగా వ్రాశారు. కానీ గోవధ ప్రారంభించటంతో 1857 ప్రధమ స్వాతంత్ర్యసంగ్రామం తరువాత బ్రిటీష్ ప్రభుత్వం ‘భారతదేశాన్ని స్థిరంగా నిలబెడుతున్న విశేషా లేమిటో తెలిసికొని వాటికి విరుగుడు సూచించా’లని ఒక కమిటీని వేసింది. అది తన రిపోర్టులో 1. ధార్మికత్వం, 2. సమాజంలోని పంచాయతీ వ్యవస్థ 3. గోవు కేంద్రంగా ఉన్న వ్యవస్థ అని మూడు కారణాలు తేల్చింది.

హనుమంతుని తొమ్మిది అవతారాలు – మొదటి అవతారమైన ప్రసన్నాంజనేయస్వామి చరిత్ర

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

Sri Prasannanjaneya Swamy - శ్రీ ప్రసన్నాంజనేయస్వామి అవతారము
Sri Prasannanjaneya Swamy - శ్రీ ప్రసన్నాంజనేయస్వామి అవతారము

శిష్యుడు – గురువుగారూ! ద్వాపరయుగ చరిత్ర చెప్పారు. తరువాత హనుమంతుడు కూడా ఏవో అవతారాలెత్తాడని అంటారు. వాటిని గూర్చి కాస్త తెలుసుకోవాలని ఉందండి.

గురువుగారు – అలాగే, ఏదైవమైనా ముఖ్యంగా రెండు ప్రయోజనాల కోసం అవతారా లెత్తడం జరుగుతుంది. అదే విషయం భగవద్గీతలో కృష్ణ భగవానుడు

‘పరిత్రాణాయ సాధూనాం – వినాశాయ చ దుష్కృతాం |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ||’

అని చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా ఆ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే రెండు ముఖ్య ప్రయోజనాలకోసమే తొమ్మిది అవతారాలెత్తాడు. వానినే హనుమన్నవావతారాలంటారు.

గోమాత విశిష్టత 8 – వైద్య ప్రయోజనాలు, సాధించే విధానాలు

గోమాత విశిష్టత

Gomatha - Indian Cow

ఆవుపాలతో అల్లపురసం, తేనెలు సమంగా కలిపి 3 ఔన్సులు ఉదయం మాత్రం పుచ్చుకొనడంవల్ల మంచి ఆకలి కలుగుతుంది.  మినపపప్పు నేతితో వేయించి చూర్ణం చేసి ఆవుపాలలో పంచదార కలిపి వండించి పరమాన్నం చేసి వాడితే ఇంద్రియ పుష్టి కలుగుతుంది. రెడ్డివారినానుబాలు రసంతీసి పిప్పళ్ళు తగుమాత్రం ఆ రసంలో నానేసి తీసి ఎండించి ఇలా 5 మార్లు చేశాక దాన్ని చూర్ణంచేసి పంచదార కలిపి పూటకొక తులం పుచ్చుకొంటూ ఆవుపాలు తాగితే ఇంద్రియం గట్టిపడుతుంది. ఆకాలంలో పుష్టికర ఆహారం తీసికొనాలి. వేపకట్టె బొగ్గు అరతులం, మంచి గంధపుచెక్క అరతులం, బెల్లం అరతులం చూర్ణంచేసి పేరుకొన్న ఆవునేతితో పుచ్చుకొంటే ఉబ్బసపు దగ్గు తగ్గుతుంది. ఆవుపాలతో కలబంద గుజ్జు, మిరియాలపొడి, పంచదార కలిపి పుచ్చుకొన్న ఉబ్బసం తగ్గుతుంది. తొమ్మిది ఔన్సుల ఆవుపెరుగులో మూడు చుక్కల కాకరాకు చుక్కల కాకరాకు పసరువేసి ఉదయంమాత్రం త్రాగితే ఉబ్బుకామెర్లు తగ్గుతాయి. పథ్యనియమంకూడా లేదు.

హనుమంతుని కధలు – హనుమంతునిచే గరుడ, సత్యభామల గర్వభంగం

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

 Garuda Bird with Lord Vishnu

శిష్యుడు- బాగుందండీ! ఇంతేనా? మరేదయినా ద్వాపరయుగంలో హనుమంతుని చరిత్ర కన్పడుతుందా?

గురువుగారు- అలా భీమార్జున గర్వభంగాలే కాకుండా హనుమంతుని వలన గరుడ గర్వభంగం జరిగిన వృత్తాంతం కూడా ద్వాపరయుగంలో చూడగల్గుతాము.

గోమాత విశిష్టత 7 – వ్యవసాయంలో గోవు, గోసంతతి ప్రయోజనం, ప్రాముఖ్యత

గోమాత విశిష్టత

Indian Cows in Agriculture

చాలా ముఖ్య విషయ మేమంటే ప్రఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త డా. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1948 లో మన దేశానికి వచ్చే డా. అమర్ నాధ్ ఝా అనే విద్యవేత్త ద్వారా ఒక సందేశం పంపారు. అది ‘భారతదేశంలో ట్రాక్టర్లవంటి యంత్రాలద్వారా నడిచే వ్యవసాయాన్ని అమలుచేయవద్దు. 400 సంవత్సరాలపాటు యంత్రాలద్వారా వ్యవసాయం చేయడంవల్ల అమెరికాదేశపు వ్యవసాయభూమి నిస్సారమైపోయింది. 10వేల సంత్సరాలపైగా వ్యవసాయం సాగుచున్న భారతదేశపు మట్టిలో సారం, శక్తీ ఇప్పటికీ తరిగిపోలేదు’ అన్నారు. యంత్రములద్వారాకాక గోసంతతిద్వారా వ్యవసాయం చేయటంలోని ప్రయోజనం ఆ శాస్త్రవేత్త సందేశంద్వారా అయినా గ్రహింపక గోసంతతిని నాశనం చేసికొని వినాశందిశగా పరుగులెత్తుతున్నాం. రసాయనిక వనరులతో సాగుతున్న వ్యవసాయం భోజనవిధానాన్ని కుంచింపజేసింది. తత్ఫలితమే ఈనాటి ప్రమాదకరమైన రోగాలు, వాతావరణ కాలుష్యాలు. అందుకే సర్ హోవర్ట్ ‘యంత్రాలద్వారా సాగే వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, క్రిమినాశకమందులు తప్పనిసరి అవుతాయి. యంత్రాలద్వారా జరిగే వ్యవసాయపు టెక్నాలజీ భయంకరమైన వాతావరణకాలుష్యాన్ని వ్యాప్తంజేస్తుంది. అనర్థాలకు ఆలవాలమైన యాంత్రిక వ్యవసాయాన్ని వైజ్ఞానికం అనటం తప్పు’ అన్నారు. పంట దిగుబడి యాంత్రిక, రసాయనిక వ్యవసాయం వలననే పెరిగిన దనుకొనటం భ్రాంతి. పరిశోధనాత్మక కృషితో దేశీయ విధానంలోను వ్యవసాయంచేసి ప్రమాదకరమైన రోగాలకు నిలయంకాని మంచి దిగుబడిని సాధింపవచ్చు.

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: