Press "Enter" to skip to content

గోమాత విశిష్టత 8 – వైద్య ప్రయోజనాలు, సాధించే విధానాలు

గోమాత విశిష్టత

Gomatha - Indian Cow

ఆవుపాలతో అల్లపురసం, తేనెలు సమంగా కలిపి 3 ఔన్సులు ఉదయం మాత్రం పుచ్చుకొనడంవల్ల మంచి ఆకలి కలుగుతుంది.  మినపపప్పు నేతితో వేయించి చూర్ణం చేసి ఆవుపాలలో పంచదార కలిపి వండించి పరమాన్నం చేసి వాడితే ఇంద్రియ పుష్టి కలుగుతుంది. రెడ్డివారినానుబాలు రసంతీసి పిప్పళ్ళు తగుమాత్రం ఆ రసంలో నానేసి తీసి ఎండించి ఇలా 5 మార్లు చేశాక దాన్ని చూర్ణంచేసి పంచదార కలిపి పూటకొక తులం పుచ్చుకొంటూ ఆవుపాలు తాగితే ఇంద్రియం గట్టిపడుతుంది. ఆకాలంలో పుష్టికర ఆహారం తీసికొనాలి. వేపకట్టె బొగ్గు అరతులం, మంచి గంధపుచెక్క అరతులం, బెల్లం అరతులం చూర్ణంచేసి పేరుకొన్న ఆవునేతితో పుచ్చుకొంటే ఉబ్బసపు దగ్గు తగ్గుతుంది. ఆవుపాలతో కలబంద గుజ్జు, మిరియాలపొడి, పంచదార కలిపి పుచ్చుకొన్న ఉబ్బసం తగ్గుతుంది. తొమ్మిది ఔన్సుల ఆవుపెరుగులో మూడు చుక్కల కాకరాకు చుక్కల కాకరాకు పసరువేసి ఉదయంమాత్రం త్రాగితే ఉబ్బుకామెర్లు తగ్గుతాయి. పథ్యనియమంకూడా లేదు.

[wp_campaign_1]

వావిలిఆకు సమూలం, గుంటకలగర సమూలం సమభాగాలుగా రెండూ కలిపి సుమారుగా ఒకతులం నూరి గిద్దెడు ఆవుపాలతో కలిపి పరగడపున ముట్టు మూడు రోజులు ఈయాలి. ఎటువంటి ముట్టునొప్పిఅయినా పోతుంది. ఆ ముట్టు మూడురోజులు పాలుఅన్నం మాత్రం తినాలి. నాగకేసరములు చూర్ణంచేసి ఆవునేతితో కలిపి స్త్రీ వాకిటనున్న కాలంలో ఇవ్వాలి. పథ్యనియమంలేదు. గర్భమును నశింపజేసే పురుగు దీనివల్ల చచ్చిపోయి గర్భము నిలుస్తుంది. పావుతులం కాకిదొండదుంప చూర్ణం, కాచని ఆవుపాలు నాలుగు ఔన్సులతో కలిపి బయటజేరినరోజు మొదలు నాలుగురోజులు పరగడపున పుచ్చుకొనాలి. ఆవుపాల అన్నం తినాలి. ఇదీ గర్భాన్ని నిలుపుతుంది. మరోపధ్ధతి పెన్నేరుగడ్డ కషాయం కాచి 6 ఔన్సుల కషాయం వడపోసి తీసికొని 6 ఔన్సుల ఆవుపాలు కలిపి కాచి, కషాయం మరిగిపోయి పాలు మిగిలిన పిదప 2 టీస్పూన్ల నేయి కలిపి ముట్టుస్నానం రోజున పుచ్చుకొంటే గర్భం నిలుస్తుంది.

[wp_campaign_2]

నల్లఉమ్మెత్తఆకు ఆవుపేడతో ఉడికించి వేడిగా ఉన్నప్పుడే కట్టాలి. గండమాల, పగలని గడ్డలు వంటివి పోతాయి. మారేడువేరు ఆవుపంచతముతో గంధముతీసి శిరస్సుకు లేపనంచేస్తే చీడపీడలు నశిస్తాయి. మారేడుపండు ఆవు పంచితముతో నూరి మేకపాలు, నీరు కలిపి కాచి చెవిలోపోస్తే చెవుడు తొలగుతుంది. మోదుగజిగురు, దాల్చినచెక్క సమంగాకలిపి పూటకు అర్థతులం చూర్ణం ఆవునేతితో రెండుపూటలూ సేవించిన జీర్ణశక్తి పెరుగుతుంది. వరుసగా గోమూత్రం త్రాగితే రక్తపుపోటు తగ్గుతుంది. గోమూత్రం ఆరోగ్యంగా ఉన్న ఆవులవి తాగాలి. ఈనిన 20 రోజుల లోపల త్రాగరాదు. జెర్సీవి, మేతకు వెళ్ళనివి తగవు. ఇలాంటి వైద్యప్రయోజనాలు శతాధికంగా ఉన్నాయి. గోమయం ఫినాయిల్ కంటే దుర్వాసనను పోగొట్టగలది, కీటాణువుల నంతంచేయగలది.

[wp_campaign_3]

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: