Press "Enter" to skip to content

గోమాత విశిష్టత 6 – గోవు ఆరోగ్యకారి మరియు ఆర్థిక ప్రయోజనకారి

గోమాత విశిష్టత

Indian Cow

గోమూత్రం – ఇది కఫము నణచునది, జీర్ణశక్తి పెంచునది, కుష్టు, ఉబ్బు, పాండువు, గుర్మం శూల, శ్వాస, కాస, మూత్రకృచ్చం, మూలవ్యాధి, జ్వరము, జఠరొగాలు, వాతం, క్రిమిరోగం వంటివానికిది ఔషధం. మలబధ్ధకాన్ని తొలగించటం, దీర్ఘరోగ నివారణం చేస్తుంది. పుడిసెడు మొదలు దోసెడు దాకా ఉదయంపూట లోపలకు పుచ్చుకొను విధానం. గోమూత్రంవల్ల ఎన్నో వ్యాధులు నయమౌతాయని సుష్రుతుడు చెప్పాడు. గోమూత్ర పురీషాలు లోపలకు పుచ్చుకొనటంవల్ల దేహానికి గల అనారోగ్యాలు దూరమౌతాయని యూరప్ దేశస్థులు పరిశోధనచేసి గ్రహించారని, ఆచరించి సత్ఫలితాలు పొందారని సుప్రసిధ్ధ పాశ్చాత్య వైద్యులు డా. మైకేల్ తాను వ్రాసిన హ్యాండ్ బుక్ ఆఫ్ బార్టియాలజీ గ్రంధం 45వపుటలో వ్రాశారు. గోమూత్రం ఎరువులలో బాగా ఉపకరిస్తుంది.

[wp_campaign_1]

గోమయం – ఆవుపేడ మలినము దుర్గంధాలను పోగొట్టేది. ఇది విషవాయుదోషాన్ని హరిస్తుంది. ఉన్మాదశాంతినికూడా కల్గిస్తుంది. దీనికి కలరా, మశూచి వంటి రోగక్రిములను సంహరింపగల శక్తికూడా ఉంది. వాతావరణ కాలుష్యాన్ని తొలగిస్తుంది. ఆవులకు జొన్నలు పెట్టి అవి పేడతోబాటు బయటకువచ్చిన తరువాత తీసి కడిగి దంచిభుజిస్తే కార్యసిధ్ధి, మహత్తర ఆధ్యాత్మికశక్తి ఏర్పడుతుంది. శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి, పండిత శ్రీరామశర్మ ఆచార్యగార్లు ఆవిధానా న్నుసరించియే ఫలితం సాధించారు. ఆవుపేడలో మెంధాల్, అమ్మోనియా, ఫినాయల్, ఇండాల్, ఫార్మాలిన్ క్రిమినాశక పదార్థాలున్నాయి. గ్రామాలలో ఆవుపేడతో కళ్లాపు చల్లటం, గోడలకు ఆవుపేడ అలకటంలోఉన్న విజ్ఞానాన్ని విజ్ఞానవేత్తలు కొనియాడారు. విదేశాలలో డాక్టర్లు ఆవుపేడతో చేసిన పిడకల పొగను రోగులచే పీల్చునట్లు చేసి సత్ఫలితాలను పొందారు. ఆవుగిట్టలు, కొమ్ములు, వెంట్రుకల పొగవేస్తే కూరగాయల చెట్లకు పట్టే చీడలు తొలగిపోతాయి. సమస్త దోషాలు, క్రిములు తొలగింపగల ఆవుపేడను శుద్దికి ప్రశస్తంగా హిందూసంప్రదాయం స్వీకరించింది. ఆవుపేడతో ఇల్లు అలుకుకొనటం ఎంతో ఆర్థిక ప్రయోజనకారి. కొందరు ముదుసలిఆవు లెందుకు? వానిని చంపితే ఏం? అని అంటారు. గాంధీగారి శిష్యులు, విజ్ఞానవేత్తలు శ్రీ పాంధరీ పాండే అనేవారు 24 సం. కృషిచేసి ముదుసలి ఆవులుసైతం ఆర్థికంగా ప్రయోజనకరాలని నిరూపించారు. ఒక కిలో ఆవుపేడలో 40 కిలోల కంపోస్టుఎరువు తయారు చేయవచ్చని నిరూపించారు. ఆవుపేడతో ఋతురాజు రంగు తయారుచేశారు. ఈ రంగు పూయడంవల్ల ఇల్లు వేసవికాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. యుధ్ధాలలో మారణాయుధాల విషవాయుప్రమాదంనుండికూడా ఇది రక్షణనిస్తుందని నిరూపించారు. ఆవుపేడలో కొన్ని ద్రవ్యాలు కలిపి అగరువత్తులు, బట్టలుతికే పౌడరుకూడా తయారుచేశారు. గోమయం కీటాణువుల పాలిటి మృత్యువే. గోమూత్రంకూడా ఎరువులలో వాడటంవల్ల కీటాణువులు, క్రిములు నాశనంచేసే ఉత్తమఎరువు తయారవుతుంది. కాబట్టి ముదుసలి ఆవులనైనా వధ్యశాలకు పంపటం వినాశహేతువే. ఒక సంవత్సరం పొడువునా ఒక్క ఆవువల్ల లభించే పేడతో 80 టన్నుల ఎరువు తయారుచేయవచ్చు. ఎనిమిది ఎకరాలలో సరిపోయే ఆ ఎరువువెల బజారులో Rs. 17,885/- గా నిర్ణయింపబడింది. గోవర్థన సంస్థ సంయోజకులు చెత్తవంటివి చేర్చి గోమయం వృధాచేయక ప్రయోగాత్మకముగా నిరూపించారు.

గోసంపదను సరిగా వినియోగిచుకొనక అవి వ్యర్థమనుకొనటం మన దౌర్భాగ్యం తప్ప వేరు కాదు. మన దేశానికి గోసంతతిని సద్వినియోగం చేసికొంటే వచ్చే ఆదాయాన్ని విజ్ఞులు అంచనాచేశారు. ఆవుపాలద్వారా సుమారు 7000 కోట్లు, ఎద్దుల శక్తిద్వారా 6000 కోట్లు, గోమయపు గ్యాస్ ప్లాంట్ల ద్వారా 2500 కోట్లు, గోమయం, గోమూత్రపు ఎరువుద్వారా 5000 కోట్లు మొత్తం 20500 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా. మాంసంద్వారా విదేశీమారక ద్రవ్యాన్ని ఆశించి ఈ ఆదాయాన్ని విస్మరించటం బంగారుబాతు గ్రుడ్లను తీసికొని సుఖించక బాతును చంపటంవంటి అజ్ఞానపు చేష్టే. దారుణమేమిటంటే ఏటా కోటిన్నరదాకా గోసంతతి కసాయి కత్తులకెర అవుతోంది. చాలా తక్కువకాలంలోనే గోసంతతి సమూలంగా నాశనమయే ప్రమాదముంది. ‘కర్తా కారయితా చైవ ప్రేరక శ్చానుమోదకః’ అని ప్రతిపనిలోను చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సహించేవాడు, ఆపక ఉపేక్షించేవాడు నల్గురూ భాగస్వాములేనట. ఈ గోహత్యా మహాపాతకంగూర్చి తెలిసి మనం చేయగల కృషి నిరసన, ప్రచారం, గోరక్షణోపాయం వంటివి యధాశక్తి చేయకపోతే మనమూ ఆ పాపంలో భాగస్వాముల మౌతాము. కాబట్టి ఈ గోవిశిష్టత, గోహత్యాదోషముల గూర్చి లోకమంతటిదృష్టికి తీసికొనిరావటం ద్వారా అయినా మన మా పాపానికి దూరంగా ఉండి గోసేవా పుణ్యాన్ని సంపాదించు కొందాం.

[wp_campaign_2]

ముదుసలి ఆవులను చంపకుండా ఏంచేస్తాం? అనేవారు ముదుసలివారు నిరర్థకమని పెద్దలను చంపుకొంటారా? గ్రాసం చాలదనటం అందుకు చెప్పే మరోవంక. ప్రతిఏటా లక్షల టన్నుల పశుగ్రాసం విదేశాలకు ఎగుమతిఔతోంది. సంఖ్య విపరీతమైతే ఎలా అనే పరిస్థితి లేదు. దేశావసరాలు తీర్చగల గోసంపద లేదు. నిజంగానే పెరిగితే వైజ్ఞానిక ప్రక్రియలున్నాయి కదా? కసాయికత్తు లెందుకు? మనుష్య జనాభా పెరుగుతోందని కసాయికత్తులు వాడుచున్నామా? కొన్ని అనాలోచిత చర్యలవల్లకూడా గోజాతి పవిత్రతను, శక్తియుక్తులను కోల్పోతోంది. విదేశీ ఆబోతుల వీర్యంతో క్రాస్ బీడింగ్ ను ప్రోత్సహించడంతో అవి త్వరగా జబ్బులకులోనై నశించడం, ఎండవేడికి తట్టుకొనలేక పాలపరిణామం తగ్గటం జాతిశక్తి హీనమవటం జరుగుతోంది. దేశంలో 32  జాతుల ఆవులున్నాయి. శ్రేష్టమైన కొన్ని జాతులు విదేశాలకు తరలింపబడటం మన దురదృష్టం. 1981లో బ్రెజిల్ దేశీలయులు రెండున్నర లక్షలకు కొనుగోలు చేసిన ఒంగోలు జాతి ఆబోతు బ్రెజిల్ లో 50 వేల దూడలకు జన్మనిచ్చింది. ప్రపంచ ఛాంపియన్ బహుమతికూడా పొందింది. మనదేశంనుండి రెండు గిత్తలను తొలుత కొనుక్కొని వెళ్ళిన బ్రెజిల్ దేశం ఒంగోలుజాతి పశువులను ఎగుమతి చేయటంలో మనకన్నా ముందుంది. మన గోసంతతి విలువ గ్రహించి వారలా చేయగా విదేశీ ఆవులు పాలు బాగాయిస్తాయని మనవారు సంకరజాతులను తయారుచేస్తున్నారు. సంకరజాతి ఉత్పత్తివల్ల ఆర్థికప్రయోజనాలు చేకూరుతున్నా వానివల్ల ఆరోగ్యభంగా లేర్పడుతున్నా యని విజ్ఞులు ఆందోళన చెందుతున్నారు. గోసంతతికూడా కల్తీచేయబడి విలువలు కోల్పోయాక దానియెడ భక్తి విశ్వాసాలు కూడా నశిస్తాయి. ఇది మన పవిత్రమైన ఉత్తమ గోజాతి సమూల నాశనానికి హేతువవుతుంది. ‘నేటి యాంత్రికయుగంలో ఈపశువులెందుకు?’ అని ప్రశ్నించేవారున్నారు. చిన్న భూముల వ్యవసాయానికి పశుసంపదే మేలు. చెట్లన్నీ నరుక్కొని ఇప్పుడు ‘చెట్లు పెంచండి’ పచ్చదనం, ‘వృక్షోరక్షతి రక్షితః’ అని చెట్లు పెంచే ఉద్యమాలు చేపట్టినట్లు గోసంపదను నాశనం చేసికొని మరల వానికై అలమటించే పరిస్థితి తెచ్చుకొంటాము. (ఇంకా ఉంది…)

[wp_campaign_3]

3 Comments

  1. Sunita Sunita June 28, 2011

    ఇప్పుడు మనం “గోమాతో రక్షతి రక్షిత: ” అనాలి. పూర్వకాలం నుంచీ గోమాత ను పూజించడం, రక్షించటం మన సాంప్రదాయం. గోమూత్రం కాన్సర్ ను తగ్గిస్తుందని విన్నాను. గోమాత విశిష్టత ఏమిటో మనకు ఎన్నో యుగాలనుంచీ తెలుసు. కానీ గోమూత్రం, గోమయం మీద ఎన్నో పేటెంట్ రైట్ లను పాశ్చాత్యులు కలిగి వున్నారు.

  2. panakanti krishna mohan panakanti krishna mohan January 8, 2012

    gomata is the heart of indian culture and it is the wonderful element for improving society’s income.save it as many as possible

  3. k v s s ramaraju k v s s ramaraju August 3, 2012

    Sir!

    I had read this website. We should our cow, god and our indian nature. we must publish all the gods( hanuman, shiva, vishnu, bhrama durga…….) this should be taken to villages, street, towns etc.. And publish workship of god.

    thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: