శ్రీరామ
జయ హనుమాన్

lord hanuman-rama-sita

శ్రీ హనుమత్ త్రికాలధ్యానం
[ ఉదయ, మధ్యాహ్న, సాయంసమయములందు హనుమద్భక్తులు క్రమముగా పఠింపవలెను.]

ప్రాతః స్మరామి హనుమంత మనంత వీర్యం
శ్రీరామచంద్ర చరణాంబుజ చంచరీకం
లంకాపురీ దహన నందిత దేవబృందం
సర్వార్థసిధ్ది సదనం ప్రధిత ప్రభావమ్||

మాధ్యం నమామి వృజినార్ణవ తారణైకా
ధారం శరణ్య ముదితానుపమ ప్రభావం
సీతాధి సింధు పరిశోషణ కర్మదక్షం
వందారు కల్పతరు మవ్యయ మాంజనేయమ్||

సాయం భజామి శరణోప సృతాభిలార్తి
పుంజ ప్రణాశన విధౌ ప్రధిత ప్రతాపం
అక్షాంతకం సకల రాక్షస వంశధూమ
కేతుం ప్రమోదిత విదేహసుతం దయాలుమ్||

[wp_campaign_1]