Press "Enter" to skip to content

Posts tagged as “stotram”

హనుమంతుని రెండవ అవతారమైన వీరాంజనేయ చరిత్ర

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

Sri Veeranjaneya Swamy - శ్రీ వీరాంజనేయస్వామి అవతారము
Sri Veeranjaneya Swamy - శ్రీ వీరాంజనేయస్వామి అవతారము

శిష్యుడుః శ్రీ హనుమంతుని రెండవ అవతారం వీరాంజనేయ చరిత్ర గురించి చెప్పుకొనాలండీ.

గురువుగారుః అవును. శ్రీ హనుమంతుని రెండవ అవతారం వీరాంజనేయస్వామి అవతారం. సుందరీనగరమనే హనుమత్పీఠంయొక్క దివ్యచరిత్ర ఇది. అంతేకాక అష్టాదశాక్షరీ మహా మంత్ర ప్రభావ చరిత్రకూడా. ఈమంత్రానికి అగస్త్యుడు ఋషి. గాయత్రీ ఛందస్సు. హనుమాన్ దేవత.ఈ మంత్ర అధిదేవత అయిన వీరాంజనేయ అవతారమూర్తి ధ్యానం –

హనుమంతుని తొమ్మిది అవతారాలు – మొదటి అవతారమైన ప్రసన్నాంజనేయస్వామి చరిత్ర

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

Sri Prasannanjaneya Swamy - శ్రీ ప్రసన్నాంజనేయస్వామి అవతారము
Sri Prasannanjaneya Swamy - శ్రీ ప్రసన్నాంజనేయస్వామి అవతారము

శిష్యుడు – గురువుగారూ! ద్వాపరయుగ చరిత్ర చెప్పారు. తరువాత హనుమంతుడు కూడా ఏవో అవతారాలెత్తాడని అంటారు. వాటిని గూర్చి కాస్త తెలుసుకోవాలని ఉందండి.

గురువుగారు – అలాగే, ఏదైవమైనా ముఖ్యంగా రెండు ప్రయోజనాల కోసం అవతారా లెత్తడం జరుగుతుంది. అదే విషయం భగవద్గీతలో కృష్ణ భగవానుడు

‘పరిత్రాణాయ సాధూనాం – వినాశాయ చ దుష్కృతాం |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ||’

అని చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా ఆ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే రెండు ముఖ్య ప్రయోజనాలకోసమే తొమ్మిది అవతారాలెత్తాడు. వానినే హనుమన్నవావతారాలంటారు.

హనుమంతుని కధలు – హనుమంతునిచే గరుడ, సత్యభామల గర్వభంగం

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)

శ్రీరామ
జయ హనుమాన్

 Garuda Bird with Lord Vishnu

శిష్యుడు- బాగుందండీ! ఇంతేనా? మరేదయినా ద్వాపరయుగంలో హనుమంతుని చరిత్ర కన్పడుతుందా?

గురువుగారు- అలా భీమార్జున గర్వభంగాలే కాకుండా హనుమంతుని వలన గరుడ గర్వభంగం జరిగిన వృత్తాంతం కూడా ద్వాపరయుగంలో చూడగల్గుతాము.

మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు, అద్వైతభావనకు ముఖ్యప్రతీక

శ్రీరామ
జయ హనుమాన్

Hanuman Shiva Rama

ఒకప్పుడు ఈ దేశంలో శైవమతం, వైష్ణవమతాల మధ్య భయంకరమయిన యుద్ధాలు జరిగాయి. ఆ ద్వేషభావాన్ని తొలగించటానికి మహనీయులెందరో యత్నించారు.

శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః, విష్ణో శ్చ హృదయం శివః
‘యధా శివమయో విష్ణుః, ఏవం విష్ణుమయ శ్శివః’ అనే సూక్తిని ఎలుగెత్తి చాటారు. అంటే విష్ణుస్వరూపుడైన  శివుడికీ, శివస్వరూపుడయిన విష్ణువుకూ నమస్కరిస్తున్నాననీ; శివస్వరూపుడయిన విష్ణువూ, విష్ణువు హృదయమే శివుడూ అని; విష్ణువు శివమయుడని, అట్లే శివుడు విష్ణువుతో నిండినవాడని అర్థం. వారిమధ్య భేదం చూడనంత వరకే మనకు మేలని కూడా చెప్పబడింది.

గోమాత విశిష్టత – 2

గోమాత

Cows
పంజాబ్ విశ్వవిద్యాలయం వారొక ప్రయోగం చేశారు. కొన్ని ఆవులు, కొన్ని గేదెలకు లెక్కప్రకారం కొంత మేతలో DDT కల్పి తినిపించారు. కొద్దిరోజుల తరువాత ఆ అవుల పాలలో 5% మాత్రమే DDT అంశాలుండగా ఆ గేదెల పాలలో 12% DDT ఉంది. DDT కల్పిన నీటితో గేదెల్ని కడిగినా వాటి పాలలో DDT అంశం ఉన్నట్లు తేలింది. ఆవులందు అలాకానరాలేదు. ఆవుపేడ, మూత్రములందున్న ఔషధగుణాలు, దివ్యశక్తి గేదెపేడ, మూత్రము లందు లేవు.

Sri Hanumada Ghorastra Stotram – శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం

శ్రీరామ
జయ హనుమాన్

 

శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం
[ఈ అస్త్రము సకల శత్రువుల యెడ విజయము చేకూర్చగల అద్భుత శక్తి కలది. సకల శక్తులను ప్రసాదింపగలది. మూడు సంధ్యలందు నిత్యము దీనిని పఠించిన యెడల అంతటా విజయమునే పొందగలరు. దీనిని లక్షసార్లు పఠించిన వారికి హనుమత్ సాక్షాత్కారము జరుగును.]

Sri Hanumath Bhujanga Prayata Stotram – శ్రీ హనుమ ద్భుజంగ ప్రయాత స్తోత్రం

శ్రీరామ
జయ హనుమాన్

Jaya Hanuman

శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం
[ఈ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రమును ప్రభాతకాలమందు, ప్రదోష సమయమందు, అర్థరాత్రియందు ఎవ్వరు పఠింతురో వారికి సమస్త పాపములు నశించును. హనుమదనుగ్రహము పొందుదురు.]

Sri Hanumat Stotram – శ్రీ హనుమత్ స్తోత్రం

శ్రీరామ
జయ హనుమాన్

Jaya Hanumanశ్రీ హనుమత్ స్తోత్రం
[ఇది పఠించుట వాక్కులతో హనుమత్పూజ చేయుటే, నిత్యము దీనిని పఠించుట వారిలోని పాపములు, దోషములు రాజహంస పాలలోని నీటిని వేరుచేయునట్లు తొలగించి సద్గుణములను నింపి హనుమంతుడు అన్ని కష్టముల నుండి రక్షించును.]

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: