శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు.ఆయనను ఆశ్రయించిన వారికి ఎట్టి విచారము, భయము ఉండదు. ఆంజనేయుని పూజించిన సర్వదేవతలను పూజించినట్లే. హనుమంతుని తన ఇంట ఎవడు ప్రతినిత్యమూ భక్తితో పూజించునో వాని ఇంట సంపదలు నిలుచును. దీర్ఘాయువు చేకూరును. సర్వత్ర విజయము చేకూరును.

హనుమంతునకు సంబంధించిన సర్వయుగాల సమగ్రచరిత్రతోబాటు హనుమత్ సంబంధమయిన బహుమూల్యమైన విషయములను గురువుగారు డా.అన్నదానం చిదంబరశాస్త్రి గారు వీడియోల ద్వారా తమ ప్రవచనములను హనుమత్ భక్తులమైన మనందరికి తెలియజేయిచున్నందుకు వారికి పాదాభివందనములు సమర్పిస్తూ, ఆ వీడియో లను ఇచ్చట పొందుపరుస్తున్నాము. హనుమంతుని గురించి మనకు తెలియని ఎన్నో విషయములు భక్తులందరూ తెలిసికొని తరించగలరని ప్రార్థన.

[wp_campaign_3]

[wp_campaign_1]

[wp_campaign_2]