హనుమంతునకు పెండ్లి అయినది
అను
శ్రీ సువర్చలా హనుమత్కల్యాణము

ఒక్కమాట

ఏ విషయంలో అయినా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తూ ఉండటం సహజం. శ్రీ హనుమంతునిగూర్చి ఎన్నో సందేహాలు సామాన్యులకు కల్గుతూ ఉంటే కొన్ని సందేహాలు ముఖ్యభక్తులకు కూడా కల్గుతూ ఉంటాయి. అటువంటి ముఖ్యమయిన విషయం హనుమంతునకు సువర్చలతో వివాహం జరగటం గూర్చినది. అనాదిగా ఉన్న ఎన్నో విషయాలు ఈనాటికీ మన దృష్టికి రాకపోవచ్చు. అది తెలిసికొనలేనిది మనతప్పుకాని విషయముయొక్క తప్పుకాదు.

ఎన్నో పురాతన హనుమదాలయాలలో కూడా సువర్చలా మూర్తులున్నాయి. శాస్త్రప్రమాణాలూ ఎన్నో ఉన్నాయి. ప్రతి హనుమదుపాసకుడూ సువర్చలాహనుమ దర్చకుడే. కాబట్టి ఎంతో మందికి ఈ విషయంలో విశ్వాసం ఉన్నా సరైన సమాధానం తమకుతాము చెప్పుకొనలేక, ఇతరులకు చెప్పలేక ఇబ్బందిపడుతూ ఉంటారు. అందుకే సకల ప్రమాణలతో, హేతుబధ్ధమైన వివరణతో వివాహ విధానంతోసహా అన్ని విషయాలూ అందిస్తూ “హనుమంతునకు పెండ్లి అయింది?” అనే పేరుతో రచన చేశాను. పదునెనిమిదేండ్లు క్రిందట దేవాదాయ ధర్మాదాయశాఖ – ఆంధ్ర ప్రభుత్వము శ్రీ సువర్చలా హనుమత్కల్యాణాలను ఆలయాలో జరుపవద్దని ఆర్డరువేసిన సందర్భంలో ఆ కల్యాణాన్ని నిరూపిస్తూ ఈరచన చేయవలసివచ్చింది. స్వామిదయవలన ప్రభుత్వం మరల కల్యాణాలను అనుమతించింది. ఆ శుభ సందర్భంగా నేను మ్రొక్కుకొని నా తల్లితండ్రులచే స్వగృహంలో శ్రీ సువర్చలా హనుమత్కల్యాణం చేయించాను. అలాగే ప్రభుత్వం హనుమ త్కల్యాణాలను అనుమతించిన సర్కులరు విషయం కూడా దీనిలో ప్రచురిస్తున్నాము. విచక్షణతో ఈ విషయాన్ని గ్రహింపగోరుచున్నాము. దీన్ని పూర్తిగా చదవటం మీ మొదటి పని. మీ తోటివారిచేత, సమీప హనుమదాలయ అర్చకులచేత చదివించటం అత్యవసరమైన అనంతర కర్తవ్యం. తప్పక ఈ కృషి సద్వినియోగమయే యత్నం చేస్తారని ఆశ.

శ్రీ సువర్చలా హనుమత్కల్యాణము (Sri Suvarchala Hanumath Kalyanam) గ్రంధమును పొందుటకు మీరు మా హనుమత్పీఠమును సంప్రదించగలరు.

ఇట్లు
సుజన విధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి

[wp_campaign_1]