Press "Enter" to skip to content

Jaya Hanumanji | జయహనుమాన్ జీ

శ్రీపరాశర సంహితా – తృతీయ భాగము విడుదల

శ్రీపరాశర సంహితా – శ్రీ ఆంజనేయస్వామి చరిత్ర – తృతీయ భాగము
(81 నుండి 120 పటములు – పదునాలుగు-పదునెనిమిది పారిజాతములు)

శ్రీపరాశర సంహితా – తృతీయ భాగము విడుదల అయినది అని తెలియజేయుటకు సంతోషించుచున్నాను.
శ్రీపరాశర సంహితా – ప్రధమ, ద్వితీయ, తృతీయ భాగములు చీరాల హనుమత్పీఠమునందు మరియు హైద్రాబాద్ నందు లభ్యమగును.

ధన్యోహం కృతకృత్యోహమ్

SriParasara Samhita - Part 3

ఏనాటి పరాశరమహర్షి! ఏనాటి పరాశర సంహిత! ఈనాటిదాకా నాదాకా వెలుగుచూడకుండా ఉండటమేమిటి? సుదీర్ఘకాలంగా మహాపండితుల కృషితో వెలువడక అల్పజ్ఞడనయిన నా దాకా ఆగటమేమిటి? కేవలం ఆ హనుమత్స్వామియొక్క కరుణ తప్ప మరేకారణముంటుంది? ఏజన్మలో చేసికొన్న తపమో ఇలా ఫలించిందని నా భావన. పూజ్య గురువులు శ్రీపాలకుర్తి వేంకట సుబ్బావధానులుగారి రూపంలో స్వామి పూర్వ తపస్సును కొనసాగింపచేసి వారి అదేశంతో పరాశరసంహిత కృషికి ప్రేరేపించాడని భావన.

ఆకునందు రెండు హనుమంతుని చిత్రములు – హనుమద్బీర

ప్రకృతి చిత్రము – హనుమద్బీరము

Hanumath-Beera

పై ఆకునందు రెండు హనుమంతుని చిత్రములు కలవు. ఇట్లు ప్రతి ఆకునందు సహజముగ హనుమన్మూర్తిద్వయము ఉండెడిచెట్టు ప్రకృతిలో నొకటున్నది. శ్రీహనుమంతుడు ప్రకృతిసిద్దముగనే చిత్రింపబడియుండు ఆకులు గల ఆ చెట్టు హనుమద్బీర. ఇది శ్రీశైలము అడవులలోగలదు. ఇలా ప్రకృతిలోనే హనుమంతుడాచెట్టు ఆకులపై చిత్రింపబడియుండుటకు కారణం “ఎవరైనా భక్తుడు ఆచెట్టు క్రింద కూర్చొని ఆంజనేయస్వామిని గూర్చి తపస్సు చేస్తూ అందు స్వామిని ఆవాహనచేసి యుండవచ్చు” అని సినీ సంగీతవేత్త శ్రీ పి.బి. శ్రీనివాస్ అభిప్రాయము.

స్నాన ప్రకరణము – ప్రవచనములు (Videos – Part 2)

స్నానము చేయకుండా,చేసెడు పుణ్యకర్మలన్నియును నిష్పలములగును. అట్టి పుణ్యఫలములన రాక్షసులు గ్రహించెదరు అని శాస్త్రవచనము. ప్రాతఃకాలమునందు స్నానము చేసినమీదట మనుష్యుడు శుచిగా అగును. కావున సంధ్యా, జప, పూజా పారాయణాదులగు సమస్త కర్మలు చేయుటకు యోగ్యుడగును.…

శ్రీరామ నవమి శుభాకాంక్షలు – శ్రీరామ జయరామ జయజయరామ

ఆత్మీయ బంధువులారా!

శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

Sita Rama Kalyanam

వేలసంవత్సరాలక్రితం మనిషిగా అయోధ్యలో అవతరించి, మానవత్వపు విలువలను ఆచరణ ద్వారా లోకానికి చాటిన ఆరాధ్యదైవం శ్రీరాముడు. శ్రీ విజయ నామ సంవత్సరమునందు వచ్చిన ఈ శ్రీరామ నవమి సందర్భముగా, మనమందరము హనుమాన్ చాలీసాను “శ్రీరామ” విజయనామ సహితంగా జపిద్దాం. ప్రతిరోజూ “శ్రీరామ జయరామ జయజయరామ” విజయనామాన్ని హనుమాన్ చాలీసాకు ముందు 108 సార్లు, ముగింపున 108 సార్లు జపించాలి.

సదాచారము – ప్రవచనములు (Videos) – Part 1

ఉదయనిద్ర లేచింది మొదలు మరల రాత్రి నిద్రపోయేదాకా మనం ఏది ఎలా ఆచరించాలో, ఎందుకు ఆచరించాలో సశాస్త్రీయముగా పరిశోధనాత్మక అంశాలతో వివరించేదే ఈ సదాచారం. మనుష్యుని పశుత్వం దిశగా పోనీక, దైవత్వంవైపు నడిపించేదే ఈ…

శ్రీ హనుమద్వ్రతము – 26th Dec, 2012 – బుధ వారము

Sri Hanumadvratam

ఆత్మీయ బంధువులారా!

శ్రీ హనుమద్వ్రత శుభాకాంక్షలు.

మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. అరటితోటలో హనుమంతునకు పూజచేస్తే తప్పక ఆ స్వామి అనుగ్రహం చేకూరుతుంది. అందునా మార్గశీర్షంలో శనివారమునాడు హనుమంతుని కదళీవనమున ఆరాధించి అందే శ్రోత్రియులకు అన్నసమారాధన మొనర్చిన తప్పక అతని నను గ్రహించి సర్వకామ్యము లీడేర్చునని పరాశులవారు చెప్పినారు. ఆ మాసమునందు శుధ్ధత్రయోదశి ప్రధానమైనది.

13th Nov, 2012 – మంగళ వారము – దీపావళి

దీపావళి శుభాకాంక్షలు హనుమత్ స్వరూపులయిన మా గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ…. ఈ దీపావళి శుభ సందర్భముగా మహాలక్ష్మి అమ్మవారు మీ అందరి జీవితాలలో అనంత ఆనందాన్ని,  ఆరోగ్యాన్ని ప్రసాదించాలని,…

19th Sep, 2012 – బుధ వారము – వినాయక చవితి

Ganesh Chaturthi

ఆత్మీయ బంధువులారా!

వినాయక చవితి శుభాకాంక్షలు.

ఈ రోజు, 19-9-2012, భాద్రపద శుద్ధ చవితి. వినాయక చవితి. ఆదౌ పూజ్యో గణాధిపః, అనటం వల్ల తలపెట్టిన పని నిర్విఘ్నంగా నెరవేరటం కోసం ప్రతి పనికీ ముందు గణపతి పూజ చేస్తాం. ఆయన వద్ద సిద్ది అనే శక్తి ఉంది. దానివలన మనకు కార్యసిద్ది జరుగుతుంది. అట్టి గణపతిని విశేషంగా పూజించే పర్వదినం వినాయక చవితి.

శ్రీ పరాశర సంహిత గ్రంథ ముద్రణ – సహకరించినవారికి కృతజ్ఞతలు

శ్రీ పరాశర సంహిత గ్రంథ ముద్రణ – సహకరించినవారికి కృతజ్ఞతలు శ్రీపరాశర సంహిత గ్రంథ ముద్రణకు సహకరింపగోరగా హనుమద్భక్తితత్పరులై సహకరించినవారికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. గ్రంథములకువలయు సహాయము లభించినందున ప్రథమభాగ ముద్రణ పూర్తి అయినది. త్వరలో…

9th Aug, 2012 – గురు వారము – శ్రీ కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి

Lord Krishna

ఆధ్యాత్మిక బంధువులారా! కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

9th Aug, 2012 నాడు శ్రావణ బహుళ అష్టమి. దీనినే ‘కృష్ణాష్టమి’ అంటారు. ఈ రోజు శ్రీకృష్ణుని జననం జరిగింది. కావున ‘కృష్ణ జయంతి’ అని, ‘జన్మాష్టమి’ అని కూడా అంటారు. తన లీలలు చూపటానికి గోకులం చేరింది కూడా ఈరోజే కావున ‘గోకులాష్టమి’ అని కూడా దీనిని అంటారు. శ్రీ కృష్ణునివన్నీ లీలలే. దొంగతనం చేసి కొందరు జైలుకు వెళ్తారు. కృష్ణుడు పుట్టటమే జైలులో పుట్టి జైలు నుండి వచ్చి దొంగతనాలు చేశాడు. నిజానికవి దొంగతనాలు కావు. వాటి అన్నిటా పరమార్ధం ఉంది. రామావతారంలో తన కౌగిలి కోరిన మునులంతా ఈ అవతారంలో గోపికలుగా పుట్టగ వారికి రాసలీల పేర కౌగిలి నందించి వారిని ధన్యులను చేశాడు. అది లీల తప్ప అందు విమర్శించవలసినది లేదు. ఎందుకనగా అప్పటికి ఆయనది పౌగండ వయస్సు(5-6 ఏండ్లు). ఇంకా చదువుకే వెళ్ళలేదు.

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: