Press "Enter" to skip to content

Posts published in “పర్వ దినములు”

శ్రీ హనుమద్వ్రతము – 4th Dec, 2014 – గురువారము

ఆత్మీయ బంధువులారా! శ్రీ హనుమద్వ్రత శుభాకాంక్షలు. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ…

23rd May, 2014, శుక్రవారము – శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు

ఆత్మీయ బంధువులారా! శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. హనుమంతుడు వైశాఖ బహుళదశమి, శనివారమునాడు, పూర్వాభాద్ర నక్షత్రమందు, వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమునందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.…

31 Mar, 2014 సోమవారం – శ్రీ జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

31 Mar, 2014 సోమవారం – ఈ రోజు శ్రీ జయ నామ సంవత్సరం, చైత్ర మాస ప్రారంభదినం. ఈ రోజు జరుపుకొనే “ఉగాది” పండుగలో పంచాంగశ్రవణం, ఉగాది పచ్చడి ఆరగించడం ప్రధాన కర్తవ్యాలు.…

Videos – శ్రీ హనుమద్వ్రతము సందర్భముగా భక్తి TV నందు ప్రసారమయిన “ధర్మ సందేహాలు”

శ్రీ హనుమద్వ్రతము సందర్భముగా భక్తి TV నందు ప్రసారమయిన “ధర్మ సందేహాలు” కార్యక్రమమునందు గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారు వీక్షకుల సందేహాలను నివృత్తి చేస్తూ, ఆచరించవలసిన విధానములు తెలియజేసినారు. ప్రసారమయిన కార్యక్రమ videos ఇక్కడ పొందుపరుస్తాన్నాము.

శ్రీ హనుమద్వ్రతము – 15th Dec, 2013 – ఆది వారము

ఆత్మీయ బంధువులారా! శ్రీ హనుమద్వ్రత శుభాకాంక్షలు.   మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది…

వినాయక చవితి శుభాకాంక్షలు – సోమవారం 9th September, 2013

ఆధ్యాత్మిక బంధువులందరికీ,

వినాయక చవితి శుభాకాంక్షలు.

ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినమిది. మహాగణాధిపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే “వినాయక చవితి” జరుపుకోవాలి. ఈ ఏడాది సోమవారం – 9th September, 2013 నాడు వినాయక చవితి.

Lord Ganesha

అజం, నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమద్వైత మానంద పూర్ణం |
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||

వ్యాస (గురు) పూజ – 22nd July, 2013 – గురువు అనుగ్రహం అవసరం

శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీరామ
జయహనుమాన్

సోమవారం 22nd July, 2013 – వ్యాస (గురు) పూజ సందర్భమున…

Veda Vyasa Guru Paurnami

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||

హనుమత్ స్వరూపులయిన మా గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పాదపద్మాలకు శిరసువంచి నమస్కరిస్తూ…

ఈ రోజు వేదవ్యాసుల వారి జన్మదినం. అపరనారాయణనుడైన వేదవ్యాసుల వలననే మన భారతీయ సంస్కృతి పరిపుష్టమయ్యింది.

హనుమజ్జయంతి శుభాకాంక్షలు – 3rd June, 2013

హనుమత్ భక్తులారా,

హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఈఏడాది జూన్ 3వ తేది హనుమజ్జయంతి.

Suvarchala Hanumanthudu

హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమందు, వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.

లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సువలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు కేసరినందనుడు, ఆంజనేయుడు, అగ్నిపుత్రుడు, పవనసుతుడు, శంకర తనయుడు అని కీర్తింపబడుచున్నాడు.

శ్రీరామ నవమి శుభాకాంక్షలు – శ్రీరామ జయరామ జయజయరామ

ఆత్మీయ బంధువులారా!

శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

Sita Rama Kalyanam

వేలసంవత్సరాలక్రితం మనిషిగా అయోధ్యలో అవతరించి, మానవత్వపు విలువలను ఆచరణ ద్వారా లోకానికి చాటిన ఆరాధ్యదైవం శ్రీరాముడు. శ్రీ విజయ నామ సంవత్సరమునందు వచ్చిన ఈ శ్రీరామ నవమి సందర్భముగా, మనమందరము హనుమాన్ చాలీసాను “శ్రీరామ” విజయనామ సహితంగా జపిద్దాం. ప్రతిరోజూ “శ్రీరామ జయరామ జయజయరామ” విజయనామాన్ని హనుమాన్ చాలీసాకు ముందు 108 సార్లు, ముగింపున 108 సార్లు జపించాలి.

శ్రీ హనుమద్వ్రతము – 26th Dec, 2012 – బుధ వారము

Sri Hanumadvratam

ఆత్మీయ బంధువులారా!

శ్రీ హనుమద్వ్రత శుభాకాంక్షలు.

మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. అరటితోటలో హనుమంతునకు పూజచేస్తే తప్పక ఆ స్వామి అనుగ్రహం చేకూరుతుంది. అందునా మార్గశీర్షంలో శనివారమునాడు హనుమంతుని కదళీవనమున ఆరాధించి అందే శ్రోత్రియులకు అన్నసమారాధన మొనర్చిన తప్పక అతని నను గ్రహించి సర్వకామ్యము లీడేర్చునని పరాశులవారు చెప్పినారు. ఆ మాసమునందు శుధ్ధత్రయోదశి ప్రధానమైనది.

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: