ఆత్మీయ బంధువులారా!

శ్రీ హనుమద్వ్రత శుభాకాంక్షలు.

Hanumadvratam 01

మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. అరటితోటలో హనుమంతునకు పూజచేస్తే తప్పక ఆ స్వామి అనుగ్రహం చేకూరుతుంది. అందునా మార్గశీర్షంలో శనివారమునాడు హనుమంతుని కదళీవనమున ఆరాధించి అందే శ్రోత్రియులకు అన్నసమారాధన మొనర్చిన తప్పక అతని నను గ్రహించి సర్వకామ్యము లీడేర్చునని పరాశులవారు చెప్పినారు. ఆ మాసమునందు శుధ్ధత్రయోదశి ప్రధానమైనది.

Hanumadvratam

మార్గశీర్షే త్రయోదశ్యాం – శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్వా దేవీ జగన్మాతా – మహావీరేణ ధీమతా ||

అని చెప్పబడుటచే ఆ దినముననే హనుమంతుడు సీతాదేవిని చూచినాడు. కావుననే ఆరోజు హనుమంతుని పూజించినవాని కోరిక లీడేరి దుఃఖనివృత్తి యగునని సీతామతల్లి వరమొసగినది. మృగశిరానక్షత్రము హనుమంతున కిష్టమైనది. ఆ నక్షత్రముకల ఆదివారమున భీముడు, ఆ నక్షత్రముకల ఆశ్వయుజ మాసమున ద్రౌపదియు హనుమంతు నారాధించి వరము నందుటవలననే అవి హనుమత్పర్వదినము లైనవి. అటువంటి మృగశిరానక్షత్రము పౌర్ణమినాడు ఉండు మాసమే మార్గశీర్షమాసము. కావున ఆ మాసము హనుమత్ప్రీతికరము. మార్గశిర మాసమున శుధ్దత్రయోదశి హనుమద్వ్రతము. అట్టి వ్రత మాచరించి స్వామియనుగ్రహమునకు పాత్రులైన సోమదత్త, నీలాదులెందరో కలరు. వారివలనే హనుమద్భక్తులెల్లరు హనుమద్వ్రత మాచరించి ఐహిక పారమార్థిక ప్రయోజనములంది ధన్యులు గావచ్చును.

శ్రీ హనుమద్వ్రతము సందర్భముగా భక్తి TV నందు ప్రసారమయిన “ధర్మ సందేహాలు” కార్యక్రమమునందు గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారు వీక్షకుల సందేహాలను నివృత్తి చేస్తూ, ఆచరించవలసిన విధానములు తెలియజేసినారు. ప్రసారమయిన కార్యక్రమ videos ఇక్కడ పొందుపరుస్తాన్నాము.