Press "Enter" to skip to content

Jaya Hanumanji | జయహనుమాన్ జీ

Sri Hanumadvishaya Sarvasvam – శ్రీ హనుమద్విషయ సర్వస్వము

ఇది కలికాలము. జీవకోటికి కష్టకాలము. కాలచక్రమాగక వేగముగా పరుగిడుచునే యున్నది. అంతకుమించి మానవుడు వేగముగా పరుగిడుచున్నాడు. అతడు అలస స్వభావి. ప్రతిపనియందు తేలిక మార్గమును చూచుకొనుచున్నాడు. సుఖమును కోరునే తప్ప అందుకు పడవలసిన కష్టముఅ…

Sri Parasara Samhita Part II – శ్రీ పరాశర సంహిత ద్వితీయ భాగము

 

parasara samhita 2

శ్రీ పరాశర సంహితను (Sri Parasara Samhita) విశ్వవ్యాప్తం చేయటంకోసం నాగర్లిపిలో ముద్రించాను. ఆనాడు సంహితపై తమ అమూల్యాభిప్రాయం ప్రసాదించిన కుర్తాళం పీఠాధిపతులు శ్రీశివచిదానందభారతీస్వామివారికి, నా సంహితకృషి నాశీర్వదించిన దత్తపీఠాధిపతులు శ్రీగణపతిసచ్చిదానందస్వామివారికి కృతజ్ఞతాపూర్వాంజలి ఘటించుచున్నాను.

శ్రీ పరాశరసంహిత (Sri Parasara Samhita) ప్రతిహనుమద్భక్తునకూ అందాలి. అందుకోసం ఏ భాగమూ లోటులేని రీతిగా చేయాలనే సత్సంకల్పం కల్గింది.

Sri Parasara Samhita Part I – శ్రీ పరాశర సంహిత ప్రధమ భాగము

parasara samhita 1

శ్రీ పరాశర సంహితను (Sri Parasara Samhita) విశ్వవ్యాప్తం చేయటంకోసం నాగర్లిపిలో ముద్రించాను. ఆనాడు సంహితపై తమ అమూల్యాభిప్రాయం ప్రసాదించిన కుర్తాళం పీఠాధిపతులు శ్రీశివచిదానందభారతీస్వామివారికి, నా సంహితకృషి నాశీర్వదించిన దత్తపీఠాధిపతులు శ్రీగణపతిసచ్చిదానందస్వామివారికి కృతజ్ఞతాపూర్వాంజలి ఘటించుచున్నాను.

Guru Prakashanam – గురు ప్రకాశనము

గురు ప్రకాశనము
30-5-2009 నాటి డా. అన్నదానం చిదంబర శాస్త్రి గారి షష్టిపూర్తి సందర్భంగా ప్రత్యేక సంచిక

సంపాదకీయం

నేను శ్రీపరాశర సంహితపై (Parasara Samhita) పరిశోధన చేస్తున్నాను. అందులో ఒక ప్రత్యేకాంశం గురువిషయమం. ఆ అంశంపై పరిశీలిస్తున్న సమయంలో పరాశరమహర్షి చెప్పిన ఒక మంచి వాక్యం నాదృష్టికి వచ్చింది. అది నాకు నచ్చింది. అది “గురుం ప్రకాశయే ద్దీమాన్ – మంత్రం యత్నేన గోపయేత్” అనేది. అటువంటి గురుప్రకాశనం చేసికొని ఋషివాక్యాన్ని సార్థకం చేయాలనిపించింది. దేనికయినా సమయం, సందర్భం ఉండాలికదా! మా నాన్నగారి షష్టిపూర్తి సమయంలో ఆ నా లక్ష్యం పూర్తిచేసికొనా లనుకున్నాను. ముందుగా నా అభిప్రాయం మా నాన్నగారితో చెప్పాను. మనమెంతవాళ్లం? అంటూనే గురుప్రకాశనం శిష్యులహక్కు. దానిని కాదనే హక్కు నాకు లేదు. మీయిష్టం అన్నారు.

Parasara Samhita (Sri Aanjaneya Charitra) – శ్రీ పరాశర సంహితా (శ్రీ ఆంజనేయ చరిత్ర)

శ్రీరాముని చరిత్రకు రామాయణ మెలా ముఖ్యమో, శ్రీకృష్ణ చరిత్రకు భాగవతమెలాగో, శ్రీ హనుమచ్చరిత్రకు ఈ పరాశరసంహిత (Parasara Samhita) అలా శరన్యమైనది. కావున ప్రతిభక్తుడూ దీనిని తప్పక చదివి అందలి హనుమద్విషయా లన్నీ గ్రహించాలి. హనుమంతునకు సంబంధించిన సర్వయుగాల సమగ్రచరిత్రతోబాటు హనుమత్ సంబంధమయిన మంత్రభాగము, తంత్రభాగము, వివిధ స్తోత్రాలు, జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన విద్యలు, ఒకటనేల? సమస్త విషయాలూ ఇందులో ఉన్నాయి. దీనిని ఇంటనుంచుకొనుట హనుమంతుని ఇంటనుంచుకొనుటే. దీనిని పారాయణముగావించుట, పూజించుట కూడా హనుమంతుని అనుగ్రహాన్ని పొందజేస్తాయి. శ్రీపరాశర మహర్షి స్వయముగా

 

‘పూజయేత్ పుస్తకం ధన్యః – స మర్త్యో ముక్తిమాన్ భవేత్’ (19-57)
‘పుస్తకస్యాపి పూజనం – అపమృత్యుం తరిష్యతి’ (25-23)

Santana Hanumath Dhyanam – సంతాన హనుమధ్ద్యానము

  [wp_campaign_1] శ్లో|| అంజనాసుత! దేవేశ! కేసరీ ప్రియనందన! దేహిమే తనయం శీఘ్రం – సర్వ భాగ్య నిధిం ప్రభో! శ్లో|| ప్రాలేయ ద్యుతి బింబకోటి రుచిర ప్రస్పర్థి దేహప్రభం భాస్వద్రత్న కిరీట మండల…

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: