
శ్రీ రామ
జయ హనుమాన్
శ్రీ హనుమన్నవావతార చరిత్ర
పూర్వజన్మ వాసనల పుణ్యమా అని నాకు హనుమంతునియందు భక్తి కుదిరింది. ఆబాల్యంగా ఆయనను సేవిస్తూ వచ్చాను. మంచి సేవకునిగా స్వామి గుర్తించాడు కాబోలు. కొన్నివేల సంవత్సరాలుగా మరుగున పడియున్న శ్రీ పరాశర సంహిత (ఆంజనేయ చరిత్ర) మహాగ్రంధాన్ని వెలుగులోకి తెచ్చే మహత్తరావకాశం నాకు లభించింది.
తన సాహిత్య సేవకు ఒక మంచి వేదిక నందిస్తూ ది.3-4-1982 న మహర్షి సత్తములు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారి కరకలములచే నా స్వగ్రామమైన ఆరేపల్లి అగ్రహారంలో శ్రీ హనుమదాధ్యాత్మిక కేంద్రమును హనుమత్ స్వామి స్థాపింపజేశాడు.
శ్రీ పరాశరసంహిత గ్రంధంమాత్రం వెలుగులోకి తెస్తే కార్యం పూర్తి కాదనిపించింది.





