Press "Enter" to skip to content

Posts published in “పర్వ దినములు”

13th Nov, 2012 – మంగళ వారము – దీపావళి

దీపావళి శుభాకాంక్షలు హనుమత్ స్వరూపులయిన మా గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ…. ఈ దీపావళి శుభ సందర్భముగా మహాలక్ష్మి అమ్మవారు మీ అందరి జీవితాలలో అనంత ఆనందాన్ని,  ఆరోగ్యాన్ని ప్రసాదించాలని,…

19th Sep, 2012 – బుధ వారము – వినాయక చవితి

Ganesh Chaturthi

ఆత్మీయ బంధువులారా!

వినాయక చవితి శుభాకాంక్షలు.

ఈ రోజు, 19-9-2012, భాద్రపద శుద్ధ చవితి. వినాయక చవితి. ఆదౌ పూజ్యో గణాధిపః, అనటం వల్ల తలపెట్టిన పని నిర్విఘ్నంగా నెరవేరటం కోసం ప్రతి పనికీ ముందు గణపతి పూజ చేస్తాం. ఆయన వద్ద సిద్ది అనే శక్తి ఉంది. దానివలన మనకు కార్యసిద్ది జరుగుతుంది. అట్టి గణపతిని విశేషంగా పూజించే పర్వదినం వినాయక చవితి.

9th Aug, 2012 – గురు వారము – శ్రీ కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి

Lord Krishna

ఆధ్యాత్మిక బంధువులారా! కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

9th Aug, 2012 నాడు శ్రావణ బహుళ అష్టమి. దీనినే ‘కృష్ణాష్టమి’ అంటారు. ఈ రోజు శ్రీకృష్ణుని జననం జరిగింది. కావున ‘కృష్ణ జయంతి’ అని, ‘జన్మాష్టమి’ అని కూడా అంటారు. తన లీలలు చూపటానికి గోకులం చేరింది కూడా ఈరోజే కావున ‘గోకులాష్టమి’ అని కూడా దీనిని అంటారు. శ్రీ కృష్ణునివన్నీ లీలలే. దొంగతనం చేసి కొందరు జైలుకు వెళ్తారు. కృష్ణుడు పుట్టటమే జైలులో పుట్టి జైలు నుండి వచ్చి దొంగతనాలు చేశాడు. నిజానికవి దొంగతనాలు కావు. వాటి అన్నిటా పరమార్ధం ఉంది. రామావతారంలో తన కౌగిలి కోరిన మునులంతా ఈ అవతారంలో గోపికలుగా పుట్టగ వారికి రాసలీల పేర కౌగిలి నందించి వారిని ధన్యులను చేశాడు. అది లీల తప్ప అందు విమర్శించవలసినది లేదు. ఎందుకనగా అప్పటికి ఆయనది పౌగండ వయస్సు(5-6 ఏండ్లు). ఇంకా చదువుకే వెళ్ళలేదు.

27th July, 2012 – శుక్ర వారము – వరలక్ష్మీవ్రతము

Varalakshmi Vratamu

ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు.

ఈ రోజు వరలక్ష్మీవ్రతము. ఇది స్త్రీలకు సంబంధించిన ముఖ్య వ్రతము. శ్రావణపౌర్ణమికి ముందువచ్చే శుక్రవారమునాడు ఈ వ్రతము చేయాలి. ఆ రోజు ఇబ్బంది ఏర్పడినవారు అనంతర శుక్రవారాల్లో చేసుకోవచ్చు. ఈ రోజు వరలక్ష్మి పూజచేసి, ఆ దేవి అనుగ్రహం సంపాదించుకొంటే, వరలక్ష్మి వరములు ప్రసాదింపగలదని, ధన, కనక, వస్తు, వాహనాదులు లోటులేకుండా అనుగ్రహింపగలదని ప్రతీతి. సువాసినులు, అంటే ముత్తయిదువులు అందరూ ఈవ్రతం చేస్తారు. దీనిద్వారా సౌభాగ్యం పొందగలుగుతారు. దీనిని ప్రత్యేకంగావున్న కల్పమును అనుసరించి నిర్వహించుకొనాలి.

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: