Press "Enter" to skip to content

శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఫలితాలు, విధానము

హనుమాన్ చాలీసా పారాయణ ఫలితాలు 

శ్రీగోస్వామి తులసీదాసు తపశ్శక్తి ధారపోసి రచించిన హనుమాన్ చాలీసా పారాయణ వలన అనేక ఫలితాలను భక్తులు స్వయముగా పొందుతున్నారు. ఒకవైపు విద్య, ఉద్యోగ, ఆరోగ్య, సంతాన సమస్యల పరిష్కారము, మరొకవైపు ఆధ్యాత్మిక ప్రగతి సాధించి హనుమ, శ్రీరామ సాక్షాత్కారాలను కూడా అనుగ్రహిస్తోంది. ఒక్కమాటలో చెప్పవలనంటే ధర్మ బద్దమైన కోరిన ప్రతి కోరికను తీర్చే చింతామణి లాంటిది ఈ హనుమాన్ చాలీసా. 

హనుమాన్ చాలీసా పారాయణము సుందరకాండ పారాయణముతో సమానము. దినమునకు 11 పర్యాయముల చొప్పున మండలము (40) రోజులు పారాయణము చేసిన సర్వకార్యసిద్ధి యగును. ప్రతిరోజూ మూడువేళలా ఒక పర్యాయము పఠించిన వారియోగక్షేమములు భక్తరక్షకుడగు హనుమంతుడే స్వయముగా చూసుకొనును. ఒకే ఆసనమున కూర్చొని 108 పర్యాయములు దీక్షతో పఠించిన విశేష కార్యసిద్ధియగును. భక్తి లోపమున్న చెప్పలేము కానీ హనుమాన్ చాలీసాలో శక్తి మాత్రము యదార్థము. 

హనుమాన్ చాలీసా పారాయణ విధానము

ధ్యానము 

పారాయణమునకు, పఠనమునకు ముందు అమంగళ పరిహారమునకు ఈ క్రింది ప్రార్థనలు చెయ్యతగినది. 

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || 

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం 
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం 
రామం నిశాచర వినాశకరం నమామి || 

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా 
అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమ త్స్మరణా ద్భవేత్ || 

అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం 
దనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం 
సకలగుణ నిధానం వానరాణా మధీశమ్ 
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి || 

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ 
రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజమ్ || 

యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్ 
తత్ర తత్ర కృతమస్త కాంజలిం 
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం || 

మనోజవం మారుతతుల్య వేగం 
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం 
వాతాత్మజ వానరయుధ ముఖ్యం 
శ్రీరామదూతం శిరసా నమామి ||

 (సేకరణ: శ్రీ హనుమద్విషయ సర్వస్వము) 

For English: Sri Hanuman Chalisa – Procedure for Amazing results in reciting Hanuman Chalisa

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: