
శ్రీ రామ
జయ హనుమాన్
‘కనబడేదల్లా నాశనమయ్యేదే’ అంటూ ‘యద్దృశ్యం తన్నశ్యం’ అంటారు. ఇక శాశ్వతము, చిరంతనము అయినదేమిటి? అని ప్రశ్న వేసుకుంటే సమాధానం శూన్యమేనేమో. ‘ఆకాశం గగనం శూన్యం’ అని అన్నారు కాబట్టి అన్నీ నాశనమైన పిదప మిగిలేశూన్యం ఆకాశమే. తార్కికులు ‘శబ్దగుణక మాకాశం’ అని అనటంవల్ల ఆ ఆకాశంద్వారా శబ్దమనే గుణంమాత్రం ఆకాశ మున్నంతకాలం ఉంటుంది. ఆశబ్దమే శ్రుతి. అందువలననే శ్రుతి చిరంతరం, సర్వప్రమణంకూడా. ఆశ్రుతి అనబడు వేదం మనకు






