హనుమంతుని సర్వ దేవాంశ సంభూతునిగా, సర్వ దేవమయునిగా చేప్పి అతనిని పూజించుటచే దేవతలందరూ పూజింపబడినట్లు అవుతుంది.
పంచముఖాంజనేయ స్వామి రూపం:


పంచముఖాంజనేయునకు పూర్వముఖము వానరము, దక్షిణమున నారసింహము, పశ్చిమమున గరుడముఖము, ఉత్తరమున వరాహముఖము, ఊర్థ్వమున అశ్వముఖము ఉండును. అయిదు ముఖములు ఒకే వరుసలో ఉండవు.
తూర్పుగా వానర ముఖము
దక్షిణముగా నృసింహ ముఖము
పశ్చిమముగా గరుడ ముఖము
ఉత్తరముగా వరాహ ముఖము
ఊర్ధ్వముగా హయగ్రీవ ముఖము
ధ్యాన శ్లోకము:
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితం
నానాలంకరణం త్రిపంచ నయనం దేదీప్యమానం రుచా |
హస్తాబ్జ్యై రసి ఖేట పుస్తక సుధాకుంభాంకుషాద్రీ న్హలం
ఖట్వాఙ్గమ్ ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహమ్ ||
Vande Vaanara Naarasimha Khagaraat Krodaasva Vaktraanchitam
Nanaalankaranam Tripancha Nayanam Dedipyamaanam Ruchaa |
Hastabjayi Rasi Kheta Pustak Sudhaakumbhankushaadri Nhalam
Khatvaajgam phani bhooruham dashabhujam sarvaari garvaapaham ||








Be First to Comment