Press "Enter" to skip to content

Jaya Hanumanji | జయహనుమాన్ జీ

వినాయక చవితి శుభాకాంక్షలు – సోమవారం 9th September, 2013

ఆధ్యాత్మిక బంధువులందరికీ,

వినాయక చవితి శుభాకాంక్షలు.

ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినమిది. మహాగణాధిపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే “వినాయక చవితి” జరుపుకోవాలి. ఈ ఏడాది సోమవారం – 9th September, 2013 నాడు వినాయక చవితి.

Lord Ganesha

అజం, నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమద్వైత మానంద పూర్ణం |
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||

వ్యాస (గురు) పూజ – 22nd July, 2013 – గురువు అనుగ్రహం అవసరం

శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీరామ
జయహనుమాన్

సోమవారం 22nd July, 2013 – వ్యాస (గురు) పూజ సందర్భమున…

Veda Vyasa Guru Paurnami

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||

హనుమత్ స్వరూపులయిన మా గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పాదపద్మాలకు శిరసువంచి నమస్కరిస్తూ…

ఈ రోజు వేదవ్యాసుల వారి జన్మదినం. అపరనారాయణనుడైన వేదవ్యాసుల వలననే మన భారతీయ సంస్కృతి పరిపుష్టమయ్యింది.

హనుమజ్జయంతి శుభాకాంక్షలు – 3rd June, 2013

హనుమత్ భక్తులారా,

హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఈఏడాది జూన్ 3వ తేది హనుమజ్జయంతి.

Suvarchala Hanumanthudu

హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమందు, వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.

లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సువలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు కేసరినందనుడు, ఆంజనేయుడు, అగ్నిపుత్రుడు, పవనసుతుడు, శంకర తనయుడు అని కీర్తింపబడుచున్నాడు.

శ్రీపరాశర సంహితా – తృతీయ భాగము విడుదల

శ్రీపరాశర సంహితా – శ్రీ ఆంజనేయస్వామి చరిత్ర – తృతీయ భాగము
(81 నుండి 120 పటములు – పదునాలుగు-పదునెనిమిది పారిజాతములు)

శ్రీపరాశర సంహితా – తృతీయ భాగము విడుదల అయినది అని తెలియజేయుటకు సంతోషించుచున్నాను.
శ్రీపరాశర సంహితా – ప్రధమ, ద్వితీయ, తృతీయ భాగములు చీరాల హనుమత్పీఠమునందు మరియు హైద్రాబాద్ నందు లభ్యమగును.

ధన్యోహం కృతకృత్యోహమ్

SriParasara Samhita - Part 3

ఏనాటి పరాశరమహర్షి! ఏనాటి పరాశర సంహిత! ఈనాటిదాకా నాదాకా వెలుగుచూడకుండా ఉండటమేమిటి? సుదీర్ఘకాలంగా మహాపండితుల కృషితో వెలువడక అల్పజ్ఞడనయిన నా దాకా ఆగటమేమిటి? కేవలం ఆ హనుమత్స్వామియొక్క కరుణ తప్ప మరేకారణముంటుంది? ఏజన్మలో చేసికొన్న తపమో ఇలా ఫలించిందని నా భావన. పూజ్య గురువులు శ్రీపాలకుర్తి వేంకట సుబ్బావధానులుగారి రూపంలో స్వామి పూర్వ తపస్సును కొనసాగింపచేసి వారి అదేశంతో పరాశరసంహిత కృషికి ప్రేరేపించాడని భావన.

ఆకునందు రెండు హనుమంతుని చిత్రములు – హనుమద్బీర

ప్రకృతి చిత్రము – హనుమద్బీరము

Hanumath-Beera

పై ఆకునందు రెండు హనుమంతుని చిత్రములు కలవు. ఇట్లు ప్రతి ఆకునందు సహజముగ హనుమన్మూర్తిద్వయము ఉండెడిచెట్టు ప్రకృతిలో నొకటున్నది. శ్రీహనుమంతుడు ప్రకృతిసిద్దముగనే చిత్రింపబడియుండు ఆకులు గల ఆ చెట్టు హనుమద్బీర. ఇది శ్రీశైలము అడవులలోగలదు. ఇలా ప్రకృతిలోనే హనుమంతుడాచెట్టు ఆకులపై చిత్రింపబడియుండుటకు కారణం “ఎవరైనా భక్తుడు ఆచెట్టు క్రింద కూర్చొని ఆంజనేయస్వామిని గూర్చి తపస్సు చేస్తూ అందు స్వామిని ఆవాహనచేసి యుండవచ్చు” అని సినీ సంగీతవేత్త శ్రీ పి.బి. శ్రీనివాస్ అభిప్రాయము.

స్నాన ప్రకరణము – ప్రవచనములు (Videos – Part 2)

స్నానము చేయకుండా,చేసెడు పుణ్యకర్మలన్నియును నిష్పలములగును. అట్టి పుణ్యఫలములన రాక్షసులు గ్రహించెదరు అని శాస్త్రవచనము. ప్రాతఃకాలమునందు స్నానము చేసినమీదట మనుష్యుడు శుచిగా అగును. కావున సంధ్యా, జప, పూజా పారాయణాదులగు సమస్త కర్మలు చేయుటకు యోగ్యుడగును.…

శ్రీరామ నవమి శుభాకాంక్షలు – శ్రీరామ జయరామ జయజయరామ

ఆత్మీయ బంధువులారా!

శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

Sita Rama Kalyanam

వేలసంవత్సరాలక్రితం మనిషిగా అయోధ్యలో అవతరించి, మానవత్వపు విలువలను ఆచరణ ద్వారా లోకానికి చాటిన ఆరాధ్యదైవం శ్రీరాముడు. శ్రీ విజయ నామ సంవత్సరమునందు వచ్చిన ఈ శ్రీరామ నవమి సందర్భముగా, మనమందరము హనుమాన్ చాలీసాను “శ్రీరామ” విజయనామ సహితంగా జపిద్దాం. ప్రతిరోజూ “శ్రీరామ జయరామ జయజయరామ” విజయనామాన్ని హనుమాన్ చాలీసాకు ముందు 108 సార్లు, ముగింపున 108 సార్లు జపించాలి.

సదాచారము – ప్రవచనములు (Videos) – Part 1

ఉదయనిద్ర లేచింది మొదలు మరల రాత్రి నిద్రపోయేదాకా మనం ఏది ఎలా ఆచరించాలో, ఎందుకు ఆచరించాలో సశాస్త్రీయముగా పరిశోధనాత్మక అంశాలతో వివరించేదే ఈ సదాచారం. మనుష్యుని పశుత్వం దిశగా పోనీక, దైవత్వంవైపు నడిపించేదే ఈ…

శ్రీ హనుమద్వ్రతము – 26th Dec, 2012 – బుధ వారము

Sri Hanumadvratam

ఆత్మీయ బంధువులారా!

శ్రీ హనుమద్వ్రత శుభాకాంక్షలు.

మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. అరటితోటలో హనుమంతునకు పూజచేస్తే తప్పక ఆ స్వామి అనుగ్రహం చేకూరుతుంది. అందునా మార్గశీర్షంలో శనివారమునాడు హనుమంతుని కదళీవనమున ఆరాధించి అందే శ్రోత్రియులకు అన్నసమారాధన మొనర్చిన తప్పక అతని నను గ్రహించి సర్వకామ్యము లీడేర్చునని పరాశులవారు చెప్పినారు. ఆ మాసమునందు శుధ్ధత్రయోదశి ప్రధానమైనది.

13th Nov, 2012 – మంగళ వారము – దీపావళి

దీపావళి శుభాకాంక్షలు హనుమత్ స్వరూపులయిన మా గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ…. ఈ దీపావళి శుభ సందర్భముగా మహాలక్ష్మి అమ్మవారు మీ అందరి జీవితాలలో అనంత ఆనందాన్ని,  ఆరోగ్యాన్ని ప్రసాదించాలని,…

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: