శ్రీరామ
జయ హనుమాన్
ఈశ్వరప్రోక్త శ్రీహనుమచ్చక్రధ్యానం
[ఈ పంచముఖ హనుమధ్ద్యానము మిక్కిలి రహస్యమైనది. ఈ ధ్యానమును నిత్యము పఠించిన యెడల హనుమదనుగ్రహముచే ఇహమున కోరికలన్నియు తీరి పరమున హనుమంతుని సన్నిధికి చేరగలరు.]
శ్రీరామ
జయ హనుమాన్

[ఈ స్తోత్రము సర్వవిధ భయములను పోగొట్టగలది. దీనిని రోజూ మూడు వేళలందు పఠించినవారికి సకల జంతు, వ్యాధి, రాజ, చోర, విషజంతు, భూతభయాదులేదియు నుండవు.]
శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ హనుమద్బడబానల స్తోత్రం
[ఈ స్తోత్రము నిత్యము పఠించదగినది. దీని వలన శత్రువులు సులభముగా జయింపబడుదురు. సకల విధములైన జ్వరములు భూత ప్రేతాదికములు, శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోవును. అసాధ్యములను సాధింపగలదీ స్తోత్రము.]
శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమన్నుతి రూప శ్లోకాష్టకము
[ఈ అష్టకమును ఉదయమున నిదురలేవగానే పఠింపవలెను. అనన్య భక్తితో అట్లు పఠించిన వారి కోరికలన్నింటిని శ్రీ హనుమంతుడు తీర్చును.]

శ్రీరామ
జయ హనుమాన్
జగద్గురు శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం
[ఈ శంకరాచార్య కృతమగు స్తోత్రము నిత్యము పఠించిన చిరకాలము ఐహిక సుఖములనుభవించి పరమున ముక్తినందగలరు.]

సర్వరక్షక ఆంజనేయ స్తోత్రం
[దీనిని నిత్యము పఠించిన వారిని హనుమంతుడన్ని విధముల రక్షించును]

శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ హనుమత్ త్రికాలధ్యానం
[ ఉదయ, మధ్యాహ్న, సాయంసమయములందు హనుమద్భక్తులు క్రమముగా పఠింపవలెను.]
ప్రాతః స్మరామి హనుమంత మనంత వీర్యం
శ్రీరామచంద్ర చరణాంబుజ చంచరీకం
లంకాపురీ దహన నందిత దేవబృందం
సర్వార్థసిధ్ది సదనం ప్రధిత ప్రభావమ్||
శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. ఎక్కువ నియామములు కల్గిన తపస్సు లేక మంత్రానుష్టానము సాధారణ భక్తులకు సాధ్యమైనది కాదు. సద్గురు ననుగ్రహం లభించి మంచి సమయంలో తద్గురూపదేశమంది ఏకాగ్రతతో సాధన చేయాలి. అందు జరిగే లోపాల వలన సాధకులకేగాక గురునకు కూడా సమస్యలు ఏర్పడుచుంటాయి. అంతటి ప్రయాసలు లేక ఎల్లరకు సులభసాధ్యమైన మార్గం స్తోత్ర పఠనం.